కిరణ్ బేడీ భర్త కన్నుమూత | Kiran Bedi's husband dead | Sakshi
Sakshi News home page

కిరణ్ బేడీ భర్త కన్నుమూత

Published Mon, Feb 1 2016 4:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

Kiran Bedi's husband dead

న్యూఢిల్లీ: తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ(76) ఆదివారం గుర్గావ్‌లో గుండెపోటుతో మరణించారు. బ్లాడర్‌లో క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత 5 నెలలుగా అమృత్‌సర్, ఢిల్లీలలో చికిత్స పొందుతున్నారని కిరణ్ బేడీ వెల్లడించారు. అమృత్‌సర్‌లోని ఫోర్టిస్-ఎస్కార్ట్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను గత నెల 28న ఇక్కడి మేదాంత-మెడిసిటీ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్సచేస్తుండగా శనివారం ఉదయం 11గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది.

పంజాబ్‌లో మత్తుపదార్ధాలకు బానిసలైన వారి బాగుకోసం, వారి పిల్లల విద్యాభ్యాసం కోసం ఆయన ఎంతగానో కృషిచేశారు. ఆయనకు అమృత్‌సర్ అంటే మహా ప్రాణం. అక్కడ పాఠశాలను ప్రారంభించి 600 మందికి విద్యనందిస్తున్నారు’ అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement