లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
అధికారిక సమాచారం కోసం సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిస్తూ సీఎం నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రద్దు చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది.
అధికారిక సమాచారం కోసం వాట్రాప్ వాడుకోవాలంటూ ఇటీవలే కిరణ్ బేడీ అధికారులకు సూచించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపడాన్ని రద్దు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.