
కిరణ్‌బేడి తొలి ప్రసంగానికి నో చాన్స్
పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదులుగా తాను అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో తొలి ప్రసంగంచేశారు.
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదులుగా తాను అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో తొలి ప్రసంగంచేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంతో మొదలుకావాల్సిన అసెంబ్లీని, తన ప్రసంగంతో మంగళవారం ప్రారంభించారు. పుదుచ్చేరిలో అధికారంపై పైచేయి సాధించడంపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, సీఎంల మధ్య సమరం సాగుతున్న విషయం తెలిసిందే. తనకు అవకాశం కల్పించాలని స్పీకర్ వైద్యలింగంకు కిరణ్‌బేడీ లేఖ రాసినా ఫలితం శూన్యం.