ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో బీజేపీ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ.. నగర మహిళలకు భద్రతపై భరోసా కలిగేలా హామీలు గుప్పిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో బీజేపీ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ.. నగర మహిళలకు భద్రతపై భరోసా కలిగేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐపీఎస్ అధికారిణిగా మూడు దశాబ్దాలకు మించిన తన పరిపాలనా అనుభవాన్ని రంగరించి ముందుకు సాగుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థమంతమైన పాలన అందిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని, ఉపాధితోపాటు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. పోలీసు అధికారిణిగా తనకున్న అనుభవంతో మహిళా భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ఆరు అంశాలతో కూడిన ప్రణాళికను అమలు చేయడంద్వారా పరిష్కరిస్తానని చెబుతున్నారు. తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పోలీసులు, ప్రాసిక్యూషన్, కారాగారా లు, మీడియా, రాజకీయ నాయకుల సహకారం తో ముందుకు సాగుతానని చెబుతున్నారు. బాలురు, బాలికల మధ్య సమానత్వం, మతబోధకుల ద్వారా సమాజానికి చక్కని సందేశాలను పంపడం తదితరాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ విషయమై కిరణ్‌బేడీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘అన్ని మతాల ప్రబోధకులు ఇందులో కీలకపాత్ర పోషించాలి. మహిళల హుందాతనానికి సంబంధించి సమాజానికి సరైన సందేశాలు అందించాలి’ అని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహిళా హెల్ప్‌లైన్ ద్వారా సమర్థమైన సేవలందిస్తామని చెప్పారు.
విద్యుత్, తాగునీటి సమస్యలకూ చెక్
నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్ కొరత సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని బేడీ చెబుతున్నా రు. ఇందుకోసం బీజేపీ పాలిత హరియాణా ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటానని చెబుతున్నారు. ‘వేసవి సమీపిస్తోంది. అందువల్ల తాగునీరు, విద్యుత్ కొరత సమస్యల పరి ష్కారానికి ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. హరియాణా ప్రభుత్వ సహ కారం ఉన్నంతకాలం మనకు ఎటువంటి సమస్యలూ రావు. ఆ ప్రభుత్వం నగరానికి నీటి ని సరఫరా చేస్తుంది’ అని అన్నారు. ఇదిలాఉంచి తే సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కిరణ్ బేడీ ఎప్పటికప్పుడు తన ఆలోచనలను నగరవాసుల ముందుంచుతున్నారు. ఇంకా రోడ్‌షోలు, ర్యాలీలు, స్థానికులతో సంభాషించడంద్వారా వారికి చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు.
స్వయంసహాయక బృందాలద్వారా శిక్షణ
మహిళలకు సాధికారత కల్పించేందుకుగాను స్వయంసహాయక బృందాలద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తామని కిరణ్‌బేడీ శనివారం ట్వీటర్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు గ్రామీణ, పట్టణ మహిళలపైనా దృష్టి సారిస్తామన్నారు. మహిళల కు భద్రత కల్పించే విషయంలో స్వచ్ఛంద సంస్థ లు కూడా కీలకపాత్ర పోషించాలన్నారు. ఇందు లో పాలుపంచుకునే ఎన్జీఓలకు ప్రభుత్వం నుం చి అవసరమైన నిధులను అందిస్తామన్నారు. మహిళా భద్రతలో భాగంగా సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
‘మన్ కీ బాత్’ తరహాలో ‘దిల్లీ కీ బాత్’
అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మన్ కీ బాత్’ మాదిరిగానే తాను కూడా ‘ఢిల్లీ కీ బాత్’ కార్యక్రమాన్ని నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కెరీర్ మేళాలు నిర్వహిస్తాం
ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న కళాశాలలు, పాఠశాలల్లో వృత్తివిద్యలో సాయంత్రం వేళ శిక్షణ ఇస్తామని బేడీ చెప్పారు. కార్పొరేట్, విద్యాసంస్థల సహకారంతో కెరీర్ మేళాలను నిర్వహిస్తామన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. తాను పైన చెప్పిందంతా రాజకీయ ప్రకటన కాదని, ఇదొక సామాజిక విప్లవం తీసుకొచ్చే ప్రయత్నమని వివరించారు.