ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వెళ్లను.. | Kiran Bedi Condemns To Be New Governor for AP | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వెళ్లను..

Published Fri, Mar 30 2018 4:54 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kiran Bedi Condemns To Be New Governor for AP - Sakshi

యానాం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తోసిపుచ్చారు. తాను ఏపీకి గవర్నర్‌గా వెళ్లనున్నట్లు వచ్చే వార్తలు నిరాధారమని ఆమె అన్నారు. ఆమె నిన్న (గురువారం) విలేకరులతో మాట్లాడుతూ తాను చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో తనకు మంచి పేరు వస్తోందని, ఈ తరుణంలో పుదుచ్చేరిలోనే ఎల్జీగా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇక ఏ రాష్ట్రానికి వెళ్లే ప్రసక్తే లేదని కిరణ్‌ బేడీ స్పష్టం చేశారు. కాగా కిరణ్‌ బేడీ వెళ్లిపోతున్నట్లు వచ్చిన వార్తలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్‌ వర్గీయులు ...ఆమె క్లారిటీ ఇవ్వడంతో నిరుత్సాహానికి గురయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement