పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కోరారు. రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే ఆరోగ్యకరమైన పుదుచ్చేరిగా మారుతుందని అన్నారు. ప్రాస్పరస్ పుదుచ్చేరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలంటూ గతంలో కూడా కిరణ్ బేడీ రజనీకాంత్ను కోరారు.
మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంగ్ గవర్నర్గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టాక ప్రతి శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో కలసి వ్యర్థపదార్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కిరణ్ బేడీ కోరారు. ఇంటి పరిసరాలు, రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి అన్నివిధాలా సాయం చేస్తోందని, పుదుచ్చేరి ఇండస్ట్రియల్ కారిడర్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే..
Published Sun, Jul 31 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement
Advertisement