హైదరాబాద్: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, అక్కడి లెఫ్టినెంట్ జనరల్ కిరణ్ బేడీకి మధ్య పొరపొచ్చాలు ముదురుతున్నాయి. పాలనా బాధ్యతలు చూసుకోవాల్సిన తనను పుదుచ్చేరి ప్రభుత్వం రబ్బరు స్టాంపులా మాత్రమే ఉండమంటోందని మంగళవారమిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బేడీ ఆరోపించారు. ఎల్జీ బాధ్యతలేమిటో తెలుసుకోవాలని వారికి చెప్పానని, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఎల్జీగా తన రెండేళ్ల పదవీకాలం ముగియగానే(వచ్చే ఏడాది మే 29) పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు.