పుదుచ్చేరిలో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వేదికపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిరణ్ బేడీ సమక్షంలోనే ఆమె పనితీరును ఎమ్మెల్యే ఆక్షేపించడంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. కిరణ్ బేడీ పర్యవేక్షణలో తన నియోజకవర్గంలో ఎలాంటి పనులూ జరగలేదన్నారు. ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించినా ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.