
కిరణ్ బేడీ... నైస్ లేడీ: కేజ్రీవాల్
కిరణ్ బేడీని ఇప్పటికీ అభిమానిస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
న్యూఢిల్లీ: కిరణ్ బేడీని ఇప్పటికీ అభిమానిస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 'కిరణ్ బేడీ చాలా మంచి మహిళ(నైస్ లేడీ). ఆమెను అభిమానిస్తా' అని ఆయన పేర్కొన్నారు. తనను విషపు మనిషి అంటూ కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలపై ఆయనీవిధంగా స్పందించారు.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం కిరణ్ బేడీని బీజేపీ పావుగా వాడుకుంటోందని, ఈ విషయాన్ని ఆమె గ్రహించలేకపోతున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఆమెతో చర్చకు సిద్దమని పునరుద్ఘాటించారు. కిరణ్ బేడీపై తాము వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులే తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారన్నారు.