అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీ బీజేపీకి కిరణ్ బేడీ ప్రచార సహాయకుడు నరేంద్ర టాండన్ ఝలక్ ఇచ్చారు!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీ బీజేపీకి కిరణ్ బేడీ ప్రచార సహాయకుడు నరేంద్ర టాండన్ ఝలక్ ఇచ్చారు! బేడీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించి చివరికి ఆయనతో రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇంతకుముందు పార్టీ నగర విభాగానికి కార్యదర్శిగా పనిచేసిన టాండన్.. సోమవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు తన రాజీనామా లేఖ పంపారు. ఆయన దాన్ని ఆమోదించారు. అయితే నేతలు బుజ్జగించడంతో రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.