పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్ | puducherry leftinent governor kiran bedi makes sensational comments | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్

Published Wed, Jun 1 2016 6:06 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్

పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హల్ చల్ చేశారు. తన సర్వీసులో అసాంఘిక శక్తులు, రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ.. లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలోనూ అదే మార్క్ చూపుతున్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, అవినీతి పరుల అంతం చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

పుదుచ్చేరి మంత్రులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం 1031 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. కిరణ్ బేడీ తీరు, వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement