బేడీ ర్యాలీకి మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మొదటిసారిగా త్రిలోక్‌పురిలో చేపట్టిన ఎన్నికల ర్యాలీకి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. గత సంవత్సరం అక్టోబరులో జరిగిన అల్లర్ల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. ర్యాలీ ప్రారంభంలో కొద్ది మందే హాజరవ్వగా, వీధుల్లోకి వె ళ్లేకొద్ది ప్రజలు తమ ఇళ్ల తలుపులు, కిటికీలు మూసేసుకున్నారు. అయితే మరో వర్గం ప్రజలు పూలతో స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ వైద్, ఆప్ మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీలతో కలసి బేడీ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు చెప్పిన సమస్యలు సావ ధానంగా ఆలకించిన కిరణ్ బేడీ తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2013 శాసన సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి మనీష్ శిసోడియా భారీ మెజారిటీతో గెలిచారు.
యువత కోసం ప్రత్యేక కార్యక్రమం
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టో ప్రకటించకపోయినా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మాత్రం తన సొంత ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. మహిళల రక్షణ కోసం బుధవారం ప్రత్యేక కార్యక్ర మం ప్రకటించిన ఆమె తాజాగా యువత అభివృద్ధికి 15 అంశాలతో మరో కార్యక్ర మం చేపడతామని ప్రకటించారు. దీనిలో భాగంగా నగరంలోని క్రీడా ప్రాంగణాలు, సౌకర్యాలు యువత కోసం పూర్తి స్థాయిలో ఉపయోగిస్తామని తెలిపారు. అంతేకాకుండా అన్ని ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒకే ఛానల్ ద్వారా అనుమతులు ఇస్తామని ప్రకటించారు.