సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సాధికారత సాధించేందుకు కృషి చేస్తామని బీజేపీ హామీయిచ్చింది. తమకు అధికారం కట్టబెడితే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామని తెలిపింది.
ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ వర్గీకరణ చేస్తామని.. అక్రమ కేసులను ఎత్తేస్తామని పేర్కొంది. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని, 16 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీయిచ్చింది. సన్నకారు, కౌలు రైతుల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది. జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని భరోసాయిచ్చింది.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఉద్యోగులతో సమానంగా వేతనాలు
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ
- డిగ్రీలో చేరిన విద్యార్థినులకు 90 శాతం సబ్సిడీపై స్కూటీలు
- చేనేత కార్మికులకు రుణాల మాఫీ
- సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం, ఆధునీకరణ
- అంచెలంచెలుగా మద్యపాన నిషేధం
- పారిశ్రామిక కేంద్రంగా రాయలసీమ అభివృద్ధికి చర్యలు
- విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి కృషి
- హిందూ మత పరిరక్షణ వ్యాప్తి కోసం చర్యలు
- 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ. 3000 పెన్షన్
- 1000 కోట్ల నిధిలో యువత సాధికార పథకం
- హోంగార్డులకు నెలకు రూ. 20 వేలు జీతం
Comments
Please login to add a commentAdd a comment