ప్రపంచ దేశాలకు పాకుతున్న కరోనా వైరస్ ప్రజలను కబలిస్తూ అల్లకల్లోకలం సృష్టిస్తోంది. ఓ వైపు ఈ మహమ్మారి విజృంభిస్తుంటే.. అంతకంటే వేగంగా కరోనా వైరస్‌పై నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాలో కరోనాపై ఫేక్‌న్యూస్‌లు పోస్ట్ చేస్తూ కొంతమంది ఆకతాయిలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే కరోనాపై అసత్య ప్రచారాలు చేయవద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే నొక్కి చెబుతున్నాయి. అలాగే వదంతులను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నాయి. అయిన్పటికీ అనేకమంది తప్పుడు వార్తలను నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఈ బాధితుల్లోకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేరారు. (ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?)
ఇటీవల కిరణ్ బేడి ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఓ ప్రాంతంలో కోడిపిల్లలు గుంపులుగా తిరుగుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘కోడిగుడ్డు వల్ల కరోనా వస్తుందన్న మూఢనమ్మకంతో మనం వాటిని పడేస్తున్నాం. అయితే అవన్నీ ఒక వారం తర్వాత పొదిగి ఇలా కోడిపిల్లలు అవుతాయి. ఇది సృష్టి స్వభావం. జీవితానికి దాని సొంత మార్గాలు ఉంటాయి’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కిరణ్ బేడీ నకిలీ వీడియోను షేర్ చేశాశారని నెటిజన్లు మండిపడుతున్నారు.
సాధారణంగా మనం ఉపయోగించే ఎగ్స్ ఎలా పొదుగుతాయని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నకిలీ వార్తలు పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాక ‘వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. నేను మళ్లీ చెబుతున్నాను. వాట్సాప్ అన్ ఇన్‌స్టాల్ చేయండి’ అంటూ కిరణ్ బేడీపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. (అసత్య ప్రచారానికి చెక్‌పెట్టేలా.. )
Eggs which were thrown as waste because of corona , after one week hatched . The creation of nature 🤔
— Kiran Bedi (@thekiranbedi) April 5, 2020
(Fwded) Life has its own mysterious ways.. pic.twitter.com/H7wMQqc7jc
Comments
Please login to add a commentAdd a comment