చెన్నై: ముఖ్యమంత్రి నారాయణ స్వామి భార్య హెల్మెట్ లేకుండా మృతి చెందినట్లు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడి అన్నారు. పుదుచ్చేరి సీఎం, గవర్నర్ మధ్య ఘర్షణ వల్ల హెల్మెట్ చట్టం అమలులోకి రావడానికి చిక్కులు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడాన్ని నిరోధించడానికి నిర్బంధ హెల్మెట్ చట్టాన్ని సుప్రీం కోర్టు ప్రవేశపెట్టింది. అయితే తమిళనాడు, పుదుచ్చేరిలలో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం లేదు. ఇలా ఉండగా హెల్మెట్ లేకుండా వెళితే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవాలని, వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలంటూ పోలీసు అధికారులకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర పోలీసు శాఖ హెల్మెట్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో నిమగ్నమైంది.
పుదుచ్చేరి సీఎం గవర్నర్ మధ్య కోల్డ్‌వార్ కారణంగా ఈ వ్యవహారంలో అభిప్రాయబేదాలు తలెత్తాయి. హెల్మెట్ చట్టాన్ని అమలుపర్చడంలో చిక్కులు కొనసాగుతున్నాయి. ఇలా ఉండగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి భార్య కలైసెల్వి (52) 2013 మే 14న బంధువుతో బైకుపై వెళుతుండగా, పుదుచ్చేరి మురుగా థియేటర్ సిగ్నల్ సమీపంలో టెంపో వ్యాను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కిరణ్ బేడి శనివారం ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment