పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి
పుదుచ్చేరి: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరి పదో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇక్కడి గాంధీ థిడాల్‌లో నారాయణ, మరో ఐదుగురు మంత్రుల చేత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రమాణం చేయించారు. వీరిలో సీఎం పీఠం కోసం పోటీపడిన నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, ఎంఓహెచ్‌ఎఫ్ షాజహాన్, ఎం.కందసామి, కమలాకన్నన్ ఉన్నారు.
యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరంతా గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారే. 30 మంది సభ్యుల అసెంబ్లీలో 15 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా 69 ఏళ్ల నారాయణ గత నెలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.