narayanasamy
-
తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రెండు నెలలుగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి షాకిచ్చింది. ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ విషయాన్ని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా 14 అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆ జాబితాలో నారాయణస్వామి పేరు లేదు. రెండో జాబితాలోనూ ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది. నారాయణస్వామి నియోజకవర్గం నెల్లిథోప్ స్థానాన్ని డీఎంకేకు కేటాయించారు. షా జహన్ కామ్రాజ్ నగర్, వి.సుబ్రమణ్యన్ కరైకల్ (నార్త్), కందసామి ఎంబలమ్, కమలకణ్నన్ థిరునల్లర్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారం బాధ్యతలను నారాయణస్వామి చూసుకుంటారని.. అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ పుదుచ్చేరి వ్యవహారాల ఇన్చార్జి గుండురావు తెలిపారు. అయితే నారాయణస్వామి పేరు ప్రకటించకపోవడం కొంత పార్టీలో విబేధాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘మోదీకి నేనంటే చాలా ఇష్టం.. అందుకే’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం... ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్‌బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా పాలన పరమైన విషయాల్లో కిరణ్‌బేడి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేకంటే ఓ చౌకీదార్‌లా ఉండేందుకే ఆమె ఉత్సాహం చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. -
సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్!
పుదుచ్చేరి: పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య మళ్లీ ఘర్షణ తారాస్థాయికి చేరింది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మంగళవారం కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వీ స్వామినాథన్, పార్టీ కోశాధికారి కేజీ శంకర్, విద్యావేత్త ఎస్ సెల్వ గణపతిలతో ఆమె హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీనిపై నారాయణస్వామి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నది. మరోవైపు ఈ నియామకాలపై స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఎలా ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారని, ఇది సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకమని సీఎం వీ నారాయణస్వామి అంటుండగా.. ఆయన ఆరోపణలను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నట్టు ఆమె తెలిపారు. ‘కేబినెట్ మంత్రులు నా దగ్గరకు వచ్చి.. మీరు ఎందుకు ప్రజలను కలుస్తున్నారు? వారి సమస్యలను ఎందుకు పరిష్కరిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. మీరు రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలని మంత్రులు అంటున్నారు’ అని కిరణ్ బేడీ అన్నారు. -
పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి
పుదుచ్చేరి: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరి పదో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇక్కడి గాంధీ థిడాల్లో నారాయణ, మరో ఐదుగురు మంత్రుల చేత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రమాణం చేయించారు. వీరిలో సీఎం పీఠం కోసం పోటీపడిన నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, ఎంఓహెచ్ఎఫ్ షాజహాన్, ఎం.కందసామి, కమలాకన్నన్ ఉన్నారు. యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరంతా గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారే. 30 మంది సభ్యుల అసెంబ్లీలో 15 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా 69 ఏళ్ల నారాయణ గత నెలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పురోగతి లేని ఎత్తినహొళె
ఇలాగే కొనసాగితే 25 ఏళ్లు గడిచినా పథకం పూర్తికాదు {పభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదు ఇప్పటి వరకూ కేవలం 300 మీటర్ల మేర పనులు పూర్తి ఎమ్మెల్సీ వై.ఎ.నారాయణస్వామి కోలారు : ప్రభుత్వం చెబుతున్న విధంగా ఎత్తిన హొళె పథకం పనులు పురోగతి సాధించడం లేదని ఎమ్మెల్సీ వై.ఎ.నారాయణస్వామి విమర్శించారు. ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు వేగవంతం చేయడం ద్వారా ఐదేళ్లలో కోలారుకు నీరు తీసుకు వచ్చేందుకు దోహపడుతుందని అన్నారు. కోలారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధృుల బందం శనివారం ఎత్తినహొళె ప్రాజెక్ట్ పనులు పరిశీలించింది. అనంతరం ఆదివారం కోలారులో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఎత్తినహొళె ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నాయని ఇలాగే కొనసాగితే మరో 25 యేళ్లు పూర్తయినా పథకం పూర్తి కాదన్నారు. ఎత్తిన హొళె పథకం పనులు వేగవంతంగా జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, అక్కడ జరుగుతున్న పనులకు పొంతన లేదని అన్నారు. ఇప్పటి వరకూ కేవలం 300 మీటర్ల మేర పైప్‌లైన్ పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ఎనిమిది చెక్‌డ్యాంలను పూర్తి చేయాల్సి ఉండగా ఒక్క చెక్‌డ్యాం నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. బయలు సీమ జిల్లాల నీటి సమస్య గురించి ప్రభుత్వం తెలుసుకోవాలని జిల్లాల నీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు పనులను వేగ వంతం చేయాలన్నారు. ప్రాజెక్టు పనులు నిరాటంకంగా సాగడానికి నీరావరి మండలిని రచించాలని డిమాండు చేశారు. ప్రతి నెలా ప్రగతి పరిశీలన జరగాలన్నారు. బయలు సీమకు చెందిన ప్రజా ప్రతినిధు లందరూ దీనిపై ఏకాభిప్రాయాన్ని వ్యక్త పరచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఎత్తినహొళె ప్రాజెక్టు ప్రగతి పరిశీలనకు వెళ్లిృ బందంలో తనతో పాటు డిప్యూటీ స్పీకర్ శివశంకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ రమేష్‌కుమార్, డి.ఎస్.వీరయ్య, మంజునాథ్‌గౌడృ కష్ణారెడ్డి, రాజణ్ణ, సుధాకర్లాల్, ముని శ్యామప్ప, శివలింగేగౌడ తదతరులు ఉన్నారని తెలిపారు. -
జేసీ ప్రోద్బలంతోనే ఎస్సీలపై దాడులు
అనంతపురం టవర్‌క్లాక్: ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రోద్బలంతోనే పీర్ల పండుగ సందర్భంగా కిష్టిపాడులో ఎస్సీలపై దాడులు జరిగాయని దళిత, ప్రజా సంఘాల నాయకులు నారాయణస్వామి, ఓబులేసు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దాడులకు బాధ్యులను గుర్తించినట్లు చెప్పారు. గ్రామంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఎస్సీ సంక్షేమ సంఘం, రజక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, దళిత సంక్షేమ పోరాట సంఘం నేతలు పలు అంశాలపై చర్చించారు. ఈనెల 24న పెద్దవడుగూరు నుంచి కిష్టిపాడుకు పాదయాత్రగా వెళ్లి గ్రామంలోని బాధితులను పరామర్శించాలని తీర్మానించారు. అదేరోజు బహిరంగ సభ నిర్వహించి ఎస్సీల్లో మనోధైర్యం నింపాలని నిర్ణరుుంచారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరన్న మాట్లాడుతూ ఎస్సీల్లో చైతన్యాన్ని చూసి ఓర్వలేకే జేసీ దాడులు చేరుుంచారని ఆరోపించారు. దాడి చేసిన వారిని వదిలి బాధిత ఎస్సీలపై కేసులు బనారుుంచడంపై ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విశ్రాంత డీఎస్పీ హరికిషన్ తదితరులు మాట్లాడారు. అనంతరం దళిత సంఘీభావ సమితిని ఏర్పాటు చేశారు. సమావేశంలో వివిధ సంఘాన నేతలు ఆశావాది జగజ్జీవన్‌రావు, మారెప్ప, నల్లప్ప, పుష్పరాజ్, జెన్నే ఆనంద్, రాజగోపాల్, ప్రభాకర్, ఇంతియాజ్, వెంకటేషు, కిష్టిపాడు గ్రామస్తులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
అనంతపురం కల్చరల్ : అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అఖిల భారత వడ్డెర్ల సంఘం గౌరవాధ్యక్షుడు నారాయణస్వామి, అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి హక్కులు సాధించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చిందని, అలా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆదివారం అనంతపురంలోని ఎల్కేపీలో వడ్డెర్ల సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజుల గోపాలక్రిష్ణ, కడప పీఠాధిపతులు సత్యనారాయణ స్వామీజి, రాష్ట్ర నేత నారాయణస్వామి ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తరాల నుంచిపెత్తందార్ల కాళ్లకింద నలిగిపోయిన వడ్డెర్లు ఇకనైనా మేల్కొవాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వడ్డెర్లు అధిక సంఖ్యలో ఎన్నికైనపుడు మాత్రమే ప్రభుత్వాలు మన మాట వింటాయన్నారు. ఇతరులకు తోకల్లా ఇంకెంత కాలం ఉంటామని ప్రశ్నించారు. జిల్లాలోని 63 మండలాలలో ప్రతి ప్రాంతానికి ఒక అధ్యక్షున్ని ఎన్నుకుని సంఘాన్ని బలోపేతం చేద్దామన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, కార్మికులకు ఆడ మగ తేడా లేకుండా లేబరు కార్డులు మంజూరు చేయాలని, సొసైటీలు ఏర్పాటు చేసుకుని సంఘటితంగా ఉండాలని తీర్మానించారు. ఏ పోరాటాలు చేసినా శాంతియుతంగా ఉండాలని, మన సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చేట్టు ఉండాలని స్వామీజీ ఉద్భోదించారు. ఈ సందర్భంగా కార్తీక మాస విశిష్టతను తెలియజేస్తూ ఆధ్యాత్మిక పరంపరలో వడ్డెర్లు మమేకం కావాలన్నారు. సాయంత్రం దాకా వడ్డెర్ల సభలు కొనసాగినా ఆధ్యంతం ఉత్సాహంగా కేరింతలు, కరతాళధ్వనులతో కళాప్రాంగణలో సందడి చేశారు. అంతకుముందు ఉదయం ప్రజా కళాకారులు తమదైన ఆటపాటలతో చైతన్యం కల్గించారు. ప్రాచీన కళారూపాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వికె గంగన్న, నాయకులు లక్ష్మీ నారాయణ, శ్రీనివాసులు, మంజుల నారాయణ, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్ల ఓటరు చైతన్యం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్... ఓటర్లు వరుసలో నిలబడి ఓట్లు వేసి బయటకు వస్తున్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు. విశేషం ఏమిటంటే, ఆ ముగ్గురూ మూడు తరాల ప్రతినిధులు.101 ఏళ్ల నారాయణ స్వామి, ఆయన కుమారుడు, మనుమరాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటి దాకా విడవకుండా ఓటు వేస్తున్న శతాధిక చైతన్యశీలి నారాయణ స్వామిని కదిలిస్తే... సామాజిక అభివృద్ధి! స్వాతంత్య్రం తరవాత భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. రిజర్వేషన్లు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. సమాజంలో అన్ని వర్గాల్లోనూ విద్యాప్రమాణాలు, జీవనప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా చిన్నతనంలో భూస్వాములు... పనివాళ్లను ఓటు వేయనివ్వకుండా కొట్టాల్లో దాచేసేవారు. ఎస్.సి. లకు కేటాయించిన స్థానాల్లో తమ పాలేర్లను నిలబెట్టి వారిని నామమాత్రంగా ఉంచేసేవారు. ఆ స్థితి నుంచి ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో స్వేచ్ఛ వచ్చింది. మేము హైస్కూల్‌కి ఏడు మైళ్లు నడిచివెళ్లాం. ఈ తరం ఇంటర్నెట్ సాయంతో ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చూసేస్తోంది. జ్ఞానం మన అరచేతిలోకే వచ్చేసింది. రవాణా సులువైంది. అప్పటితో పోలిస్తే చాలానే అభివృద్ధి జరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్బుక్లో నాయకుల కామెంట్లకు లైక్‌లు కొట్టే యువత పోలింగ్‌బూత్ వైపు అడుగు వేయట్లేదు. అలాంటిది ఈ వందేళ్ల పౌరుడు ఓటేయడానికి వచ్చాడు. తనతోపాటు కొడుకును తీసుకురావడం సరే... మనుమరాలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ప్రేరణగా నిలిచారీయన. ఈ సందర్భంగా మువ్వా నారాయణస్వామి పంచుకున్న అనుభవాలు... గ్రామంలో చైతన్యం! ‘‘మాది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర నరసాయపాలెం. మా గ్రామంలో సామాజిక చైతన్యం ఎక్కువే. ఇందుకు ఓ ఉదాహరణ... 1952- 55 మధ్య సంగతి ఇది. జాతీయ కాంగ్రెస్ పార్టీ గురించి, రాజకీయ విధానాల గురించి గ్రామస్థులకు వివరించే ప్రయత్నంలో మేధావులు ఊరూరికీ వచ్చారు. మా ఊరికీ ఇద్దరు న్యాయవాదులు వచ్చారు. వాళ్లు ఊరిపొలిమేరలో పశువుల కాపర్లతో మాటలు కలిపారు. అప్పుడు మా గ్రామంలో పశువులు కాసుకునే వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆ లాయర్లు బదులు చెప్పలేకపోయారు. నిరక్షరాస్యుల్లోనే ఇంత చైతన్యం ఉంటే చదువుకున్న వాళ్లతో చర్చించడం తమకు సాధ్యమయ్యే పని కాదని ఊళ్లోకి రాకుండానే వెనక్కివెళ్లారు. అదే చైతన్యంతో మేము గ్రామంలో పాతుకొని పోయి ఉన్న మారెమ్మ జాతరలో జంతుబలిని ఆపేశాం. వేదాలు చదివిన త్రిపురనేని రామస్వామి చౌదరి, కొల్లూరి రాఘవయ్యలతో గ్రామంలో తర్కం నడిపి పొత్తర్లు వంటి క్రతువులను ఆపేశాం’’ అన్నారు నారాయణస్వామి. యోధుల ప్రసంగాలు... రచనలు! జాతీయోద్యమం దిశగా తనను ప్రభావితం చేసిన అంశాలనూ గుర్తు చేసుకున్నారాయన. ‘‘వీర సావర్కర్ రాసిన ‘ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ చదివాను. మార్క్స్, వివేకానందుని రచనలు చదివాను. మా చిన్నప్పుడు వేసవిలో గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. చండ్రరాజేశ్వరరావు గారి దగ్గర డ్రిల్ నేర్చుకోవడం నాకు బాగా గుర్తుంది. కమ్యూనిస్టు నాయకులు వచ్చి విప్లవాల గురించి బోధించేవారు. వివిధ దేశాల విప్లవాలను చదివాను. ఆ ప్రభావంతో ఇంటర్ చదివేటప్పుడు బందరులో ఎన్నికల్లో చల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా ప్రచారం చేశాం’’ అన్నారు. ప్రజా జీవితం నుంచి అజ్ఞాతం లోకి... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టులకు పోరాటం తప్పలేదు. 1947లో మనకు ప్రకటించింది సంపూర్ణ స్వాతంత్య్రం కాదు, అధినివేశ ప్రతిపత్తి మాత్రమేనని, భారతీయులు బ్రిటన్ రాణి పాలనలో ఉన్నట్లేనని ఊరూరా ప్రచారం చేశాం. 1948వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మా నరసాయపాలెంలో నేను ప్రసంగిస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత జైలు జీవితం అనుభవించాను. వీటన్నింటినీ దాటుకుని 1950లలో మా బాపట్లలో స్వయంగా ఎన్నికలు నిర్వహించిన బృందం మాది. మా ఊరి గ్రంథాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చింది ప్రభుత్వం. అప్పుడు మేము మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. మా నాన్న ప్రజాఉద్యమాలు, రాజకీయాల్లో ఎంత చొరవగా ఉన్న ఫర్వాలేదు, కానీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయవద్దు అన్నారు. ఎందుకన్నారో తెలియదు, ఆ మాట ప్రకారం నేను పోటీ చేయలేదు’’ అన్నారు. ఎందుకు ఉద్యమించామో! ప్రజల నిరాసక్తత ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదంటారు రాజనీతిజ్ఞులు. ఆ స్తబ్ధత పోవాలంటే ఓ నిశ్శబ్ద విప్లవం రావాల్సిందే. కానీ మనదేశంలో విప్లవం వచ్చే అవకాశాల్లేవంటారు నారాయణస్వామి. ‘‘పాశ్చాత్యులు వచ్చిన వందల యేళ్లకు కానీ జాతీయోద్యమం మొదలు కాలేదు. అప్పట్లో పోలీసులు వస్తే మా ఇంటి కుక్క వాళ్లను అడ్డుకుంది. దానిని తుపాకీతో మోది చంపారు. వెనుకవైపు నుంచి వచ్చిన పోలీసులను మా ఎడ్లు ఢీ కొన్నాయి. పోలీసుల విధ్వంసంతో ఒక ఎద్దుకు పిచ్చిపట్టింది, మా నాన్న పక్షవాతంతో మంచం పట్టారు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే అప్పుడు మేము ఉద్యమించినది ఎందుకో అర్థం కావట్లేదు’’ అన్నారు కొంత నిర్లిప్తంగా. క్రియాశూన్య జ్ఞానంతో సున్నా! గ్రామాలు రాజకీయంగా చైతన్యవంతం అయ్యాయి. గ్రామీణులు ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. కానీ ఊళ్లో అరుగుల మీద కూర్చుని ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేదు అని తూర్పారబట్టడానికే పరిమితమవుతున్నారు. సొంతూళ్లో పాల డెయిరీ ఎలా నడుస్తోంది? చౌక దుకాణంలో సరుకులు సరిగా ఇస్తున్నారా? పంచాయితీ ఎలా నడుస్తోంది... అని చూడడం లేదు. క్రియాశూన్యమైన కొండంత జ్ఞానంతో ఏదీ సాధించలేం, క్రియాశీలకంగా గోరంత జ్ఞానం చాలు... అనేటప్పుడు ఆయన మాటల్లో సమాజానికి ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం కనిపించింది. నాటి జ్ఞాపకాలతోనే... ‘‘రెండవ ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల సైన్యం మనదేశంలోకి చొచ్చుకు వస్తోందనే సమాచారంతో మాకు ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించారు. చేతి రుమాలులో కొండరాళ్లు కట్టే వాళ్లం. శత్రువులు వస్తే ఆ రాళ్ల మూటను వడిసెలాగా తిప్పి విసిరితే అక్కడికక్కడే కింద పడిపోతారు. అలా ఏవేవో నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థం కాని పుస్తకం తీసుకుని కుస్తీ పట్టడమే నా వ్యాపకం’’ అన్నారాయన నవ్వుతూ. ప్రతిరోజూ ‘ది హిందూ’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికలు చదువుతారు నారాయణస్వామి. ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్‌ను క్రమం తప్పరు. వీటితోపాటు ప్రాచీన భారతీయ సంస్కృతి, సామాజిక రచనలనూ చదువుతారు. ప్రజాస్వామ్యం అంటే... ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల ద్వారా పరిపాలన సాగడం అని మాత్రమే మనకు పుస్తకాలు తెలిపాయి. అయితే ఆ ప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యేవారే అయి ఉండాలని మరో భాష్యం చెప్పారు నారాయణస్వామి. ఈయన చదివిన పుస్తకాలన్నీ చదవడం ఎందరికి సాధ్యమవుతుందో కానీ, ఆయనే ఓ పుస్తకం. ఈ పుస్తకాన్ని చదవగలిగితే చాలా విషయాలు తెలుస్తాయనడంలో సందేహం లేదు. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు : ఎస్ ఎస్ ఠాకూర్ మనలో ఒకరైతే! ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు నియోజకవర్గ ప్రజలకు తెలిసిన వారైతే ఓటు వేయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రజల్లో మమేకమై నియోజకవర్గంలోని ప్రజల కోసం పనిచేసిన వాళ్లు, కనీసం మాటసాయానికి అందుబాటులో ఉండే వాళ్లు నిలబడితే అందరూ ఓటు వేస్తారు. అలా కాకపోతే ఎన్నికల పట్ల ఆసక్తి చూపించలేరు. ఇందుకు బాధ్యత అంతా రాజకీయ పార్టీలదే. - మువ్వా నారాయణస్వామి -
ప్రధానిపై విమర్శలకు సందర్భాన్ని మోడీ దుర్వినియోగం చేశారు: నారాయణస్వామి
స్వాతంత్ర్య దినోత్సవం లాంటి సందర్భాన్ని.. ప్రధానమంత్రిపైన, యూపీఏ ప్రభుత్వంపైన విమర్శల కోసం నరేంద్రమోడీ దుర్వినియోగం చేశారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి అన్నారు. ఆరోజు బహిరంగ వేదికను మోడీ దుర్వినియోగం చేశారని, తన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, సాధించిన విజయాలను ప్రస్తావించడానికి బదులు విమర్శలకే ఆయన అధిక సమయం కేటాయించారని చెప్పారు. తద్వారా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కూడా అర్హుడు కాదని నిరూపించుకున్నట్లు విమర్శించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేంద్రాన్ని విమర్శించడం ద్వారా సంప్రదాయాలను ఉల్లంఘించారని నారాయణస్వామి అన్నారు. పుదుచ్చేరి సర్కారు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా అమలుచేయలేకపోవడం వల్లే ఆ రాష్ట్రం పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్ఆరు. త్వరలో శ్రీలంకలో జరగబోయే చోగమ్ సదస్సులో పాల్గొనకూడదంటూ డీఎంకే సహా తమిళనాడులోని రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు వస్తున్నందువల్ల దానిపై ప్రధానమంత్రి ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు.