పురోగతి లేని ఎత్తినహొళె | Lack of progress ettinahole | Sakshi
Sakshi News home page

పురోగతి లేని ఎత్తినహొళె

Published Mon, May 4 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

Lack of progress ettinahole

ఇలాగే కొనసాగితే 25 ఏళ్లు గడిచినా పథకం పూర్తికాదు
{పభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదు
ఇప్పటి వరకూ కేవలం 300 మీటర్ల మేర పనులు పూర్తి
ఎమ్మెల్సీ వై.ఎ.నారాయణస్వామి


కోలారు : ప్రభుత్వం చెబుతున్న విధంగా ఎత్తిన హొళె పథకం పనులు పురోగతి సాధించడం లేదని ఎమ్మెల్సీ వై.ఎ.నారాయణస్వామి విమర్శించారు. ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు వేగవంతం చేయడం ద్వారా ఐదేళ్లలో కోలారుకు నీరు తీసుకు వచ్చేందుకు దోహపడుతుందని అన్నారు. కోలారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధృుల బందం శనివారం ఎత్తినహొళె ప్రాజెక్ట్ పనులు పరిశీలించింది. అనంతరం ఆదివారం కోలారులో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఎత్తినహొళె ప్రాజెక్టు  పనులు మందకొడిగా సాగుతున్నాయని ఇలాగే  కొనసాగితే మరో 25 యేళ్లు పూర్తయినా పథకం పూర్తి కాదన్నారు. ఎత్తిన హొళె పథకం పనులు వేగవంతంగా జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, అక్కడ జరుగుతున్న పనులకు పొంతన లేదని అన్నారు.

ఇప్పటి వరకూ కేవలం 300 మీటర్ల మేర పైప్‌లైన్ పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ఎనిమిది చెక్‌డ్యాంలను పూర్తి చేయాల్సి ఉండగా ఒక్క చెక్‌డ్యాం నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. బయలు సీమ జిల్లాల నీటి సమస్య గురించి ప్రభుత్వం తెలుసుకోవాలని జిల్లాల నీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు పనులను వేగ వంతం చేయాలన్నారు. ప్రాజెక్టు పనులు నిరాటంకంగా సాగడానికి నీరావరి మండలిని రచించాలని డిమాండు చేశారు.  ప్రతి నెలా ప్రగతి పరిశీలన జరగాలన్నారు. బయలు సీమకు చెందిన ప్రజా ప్రతినిధు లందరూ దీనిపై ఏకాభిప్రాయాన్ని వ్యక్త పరచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఎత్తినహొళె ప్రాజెక్టు ప్రగతి పరిశీలనకు వెళ్లిృ బందంలో తనతో పాటు డిప్యూటీ స్పీకర్ శివశంకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ రమేష్‌కుమార్, డి.ఎస్.వీరయ్య, మంజునాథ్‌గౌడృ కష్ణారెడ్డి, రాజణ్ణ, సుధాకర్‌లాల్, ముని శ్యామప్ప, శివలింగేగౌడ తదతరులు ఉన్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement