
వాటి జోలికే వెళ్లను!
తోటి నటీనటులు బయోపిక్స్ బాట పడుతున్నా, కరీనా కపూర్ మాత్రం వాటి జోలికి వెళ్లనంటున్నారు
తోటి నటీనటులు బయోపిక్స్ బాట పడుతున్నా, కరీనా కపూర్ మాత్రం వాటి జోలికి వెళ్లనంటున్నారు. ‘‘బయోపిక్స్‌లో నటించాలని చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ అదేదో ట్రెండ్ కాబట్టి చేయడం కరెక్ట్ కాదు. కిరణ్ బేడీ మీద సినిమా తీయాలని నన్ను సంప్రదించారు. కానీ నేను ఒప్పుకోలేదు. మరెవరి పాత్రలోనో నన్ను ఊహించుకోలేను.
కానీ నా సహనటులు మాత్రం బయోపిక్స్‌లో నటి స్తూ ఈ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. తమకు బాగా సూట్ అయ్యే పాత్రలనే ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు ‘మేరీ కోమ్’ సినిమా తీసుకోండి...ప్రియాంక చోప్రా తప్పించి ఆ సినిమాకు ఎవరూ న్యాయం చేయలేర న్న విధంగా నటించారు. ఈ పాత్ర కోసమే నేను పుట్టానా? అన్న విధంగా ఉండాలి. నేను నటించిన ‘ఓమ్‌కారా’, ‘చమేలి’ సినిమాల్లోని పాత్రలు అలాంటివే. అప్పుడు ఆలోచిస్తా’’ అని అంటున్నారు కరీనా కపూర్.