'ఆనాడే కిరణ్ బేడీకి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం' | I Offered Kiran Bedi Chief Minister's Post, Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

'ఆనాడే కిరణ్ బేడీకి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం'

Published Thu, Jan 29 2015 3:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'ఆనాడే కిరణ్ బేడీకి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం' - Sakshi

'ఆనాడే కిరణ్ బేడీకి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం'

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి అప్పట్లోనే ఆ పదవిని ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్పష్టం చేశారు. గురువారం జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటూర్యూలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీ పోటీకి దిగేనప్పుడే ఆమెకు సీఎం పదవిని ఆఫర్ చేశామని తెలిపారు. కిరణ్ బేడీ విధివిధానాలు నచ్చే తాము అప్పట్లో ఆ పదవికి ఆమెను ఆఫర్ చేశామన్నారు.అయితే ఆమె తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో తాను దిగ్బ్రాంతికి గురయినట్లు కేజ్రీవాల్ తెలిపారు.
 

కిరణ్ బేడీని బీజేపీ ఎన్నికల్లో దింపి బలిపశువును చేసిందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కిరణ్ బేడీ తనను విషపూరితమైన వ్యక్తిగా వ్యాఖ్యానించినా.. ఆమెపై తాను ఎప్పటికీ  ఆ తరహా వ్యాఖ్యలు చేయబోనన్నారు. ఫిబ్రవరి 10 తరువాత కిరణ్ బేడీనీ బీజేపీ మరచిపోవడం ఖాయమని ఒక ప్రశ్నకు  సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement