సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేసిన రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్ లు హత్యాయత్నం అనేది బూటకమని పేర్కొంటూ లోయర్‌కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయమని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పేట్ బషీరాబాద్ సీఐ ఎస్.రమేశ్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. లోయర్‌కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చారు. విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment