
సాక్షి, విజయవాడ : మాజీ ఐపీఎస్ అధికారి షేక్ మహ్మద్ ఇక్బాల్‌కు వైఎస్సార్‌సీపీలో కీలక బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు సోమవారం పత్రికాప్రకటనను విడుదల చేశారు. పార్టీ అధినేత, అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహ్మద్ ఇక్బాల్‌ను విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు.