శివాజీనగర: పోలీస్ నియామక విభాగపు చీఫ్‌గా ఏడీజీపీ అమృత్ పాల్ నియమితులయ్యాక ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. ఇందులో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవాలని ఆయన కుట్ర పన్నారని సీఐడీ విచారణలో తేలింది. ఈ స్కాంలో అమృత్‌పాల్‌ను మూడురోజుల కిందట అరెస్టు చేయడం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు, అభ్యర్థుల నుంచి వసూలు చేసిన సొమ్ములో అమృత్ పాల్‌కు కోట్లాది రూపాయల వాటా అందినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
సీఎంకు సిద్దు సవాల్
కాంగ్రెస్ సర్కారు హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాల అక్రమాలను విడుదల చేస్తానని సీఎం బసవరాజ బొమ్మై చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పందిస్తూ ఆధారాలుంటే విచారణ జరపాలని సవాల్ చేశారు. బుధవారం బెంగళూరులో మాట్లాడుతూ సీఎం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ సమయంలో బొమ్మై ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అక్రమాలు జరిగాయని తెలిసినపుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment