ఏఎస్పీ మృతిపై కొనసాగుతున్న సీఐడీ విచారణ | CID interrogation on IPS Officer K Sasikumar death on second day | Sakshi
Sakshi News home page

ఏఎస్పీ మృతిపై కొనసాగుతున్న సీఐడీ విచారణ

Published Sat, Jun 18 2016 11:54 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

CID interrogation on IPS Officer K Sasikumar death on second day

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ మృతిపై సీఐడీ దర్యాప్తు శనివారం రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం శశికుమార్ మృతి చెందిన ఏఎస్పీ బంగ్లాను సీఐడీ ఐజీ, ఎస్పీ పరిశీలించారు. అలాగే ఏఎస్పీ కార్యాలయం సిబ్బంది పలు ప్రశ్నలు అడిగారు. శశికుమార్ బంగ్లాలో పని చేస్తున్న సిబ్బందిని కూడా సదరు అధికారులు ప్రశ్నించారు.

బుధవారం తెల్లవారుజామున శశికుమార్ తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకున్న సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఏఎస్పీ కె.శశికుమార్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement