ముంబై: 16 గంటల వ్యవధిలో 3.8 కిమీ ఈత, 180.2 కిమీ సైకిల్ రైడ్, 42.2 కిమీ పరుగును పూర్తి చేసి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి. పింప్రి చించ్వాడ్ పోలీసు కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రకాష్.. 2017లో ప్రతిష్టాత్మక ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ టైటిల్‌ను సాధించడంలో భాగంగా ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత సివిల్ సర్వెంట్‌గా ఆయన రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.
కాగా, ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఫీట్లలో ఒకటిగా పరిగణించబడే ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్‌ను, కృష్ణ ప్రకాష్ అవలీలగా పూర్తి చేసి.. భారత దేశ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి సివిల్ సర్వెంట్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను భారత్‌లో మరే ప్రభుత్వ అధికారి కానీ సాయుధ దళాలు, పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన అధికారులు కానీ సాధించకపోవడం గమనార్హం. అథ్లెట్లకు కూడా సాధ్యం కాని ఈ ఫీట్‌ను సర్వీస్‌లో ఉన్న కృష్ణ ప్రకాష్ సాధించడంతో అతన్ని నిజంగా ఉక్కు మనిషే అంటున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment