
సాక్షి, విశాఖ : నీటి గుంటలో దిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం అనకాపల్లి మండలం అంకిరెడ్డి పాలెంనకు చెందిన బాలురు సరదాగా ఈత కొడతామని నీటి గుంటలో దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో నీటి మడుగులో ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో విషాదచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment