
ఆస్ట్రేలియన్ నటి, సింగర్, మోడల్ అలీ సింప్సన్ చావు చివరి అంచుల దాకా వెళ్లొచ్చింది. స్విమ్మింగ్ చేయబోయి మెడ విరగ్గొట్టుకున్న ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ద మాస్క్‌డ్ సింగర్', 'ఐయామ్ ఏ సెలబ్రిటీ.. గెట్ మీ అవుట్ ఆఫ్ ఇయర్(2021)' సిరీస్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న అలీ సింప్సన్ తాను ఆస్పత్రిపాలైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
'కొన్నిసార్లు కళ్లు మూసి తెరిచేలోపు ఊహించనివి జరుగుతుంటాయి. నేనేతై నూతన సంవత్సరాన్ని విరిగిన మెడతో, కరోనా పాజిటివ్‌తో ప్రారంభించాను. స్విమ్మింగ్ పూల్‌లోకి దూకగానే నా తల కింద నేలకు గట్టిగా తగిలింది. నన్ను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ అన్నీ చేస్తే నా మెడకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అత్యవసర సర్జరీ ఏమీ చేయనవసరం లేదన్నారు. మెడకు పట్టీ వేసి ఇంటికి పంపించారు. నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు.
ఇంకా నయం.. నా వెన్నుపూసకు ఏమీ అవలేదు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి బట్టగట్టినందుకు అదృష్టంగా ఫీలవుతున్నాను. నన్ను ఎంతో బాగా చూసుకోవడమే కాక భోజనం ఏర్పాటు చేస్తూ బహుమతులు పంపుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు వైద్యం చేస్తున్న ఆస్పత్రి సిబ్బందికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నాలా కాకుండా మీరందరూ గొప్పగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. లోతు తెలియకుండా దేనిలోనూ దూకకండి' అని సూచించింది అలీ.
Comments
Please login to add a commentAdd a comment