టోక్యో: ఒలింపిక్స్ మహిళల స్విమ్మింగ్‌లో అనూహ్య ఫలితం నమోదైంది. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ కేటీ లెడెకీకి (అమెరికా) చుక్కెదురైంది. సోమ వారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల అరియార్ని టిట్మస్ విజేతగా అవతరించింది. ఎనిమిది ల్యాప్‌ల రేసులో నాలుగు ల్యాప్‌లు ముగిసేవరకు లెడెకీ ఆధిక్యంలో కొనసాగింది. ఆ తర్వాత టిట్మస్ ఒక్కసారిగా వేగం పెంచింది.
చివరి ల్యాప్‌లో లెడెకీని వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లి చివరకు చాంపియన్‌గా నిలిచింది. టిట్మస్ 3 నిమిషాల 56.69 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకోగా... లెడెకీ 3 నిమిషాల 57.36 సెకన్లలో గమ్యానికి చేరుకొని రజత పతకంతో సరిపెట్టుకుంది. 24 ఏళ్ల లెడెకీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో 15 స్వర్ణాలు, మూడు రజత పతకాలు గెల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment