అనిల్ (ఫైల్) ,వేణుగోపాల్ (ఫైల్)
పిడుగురాళ్ల రూరల్ (గురజాల): భోగి పండుగ రోజు సరదాగా ఈతకు వెళ్లిన బావ, బావ మరుదులు కాలువలో మునిగి మృతిచెందారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వేణుగోపాల్ (22) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. వేణుగోపాల్ మేనత్త కుమారుడు అనిల్ (18) పెదగార్లపాడులో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం భోగి పండుగ నాడు బావ, బావమరిది ఇద్దరూ కలసి తంగెడ మేజర్ కాలువలో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ గల్లంతయ్యారు. వారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులు వచ్చి చూడగా బట్టలు, చెప్పులు కాలువ ఒడ్డున కనిపించాయి. దీంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఆందోళనకు గురై.. గాలింపు చేపట్టగా, రెండు గంటల తర్వాత విగతజీవులుగా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment