Viral Video: శిష్యురాలు స్వర్ణం గెలవగానే ఆ కోచ్‌ ఏం చేశాడో చూడండి..! | Tokyo Olympics: Coach Wild Celebration Goes Viral After Australian Swimmer Wins Gold | Sakshi
Sakshi News home page

Viral Video: శిష్యురాలు స్వర్ణం గెలవగానే ఆ కోచ్‌ ఏం చేశాడో చూడండి..!

Published Mon, Jul 26 2021 7:58 PM | Last Updated on Mon, Jul 26 2021 10:15 PM

Tokyo Olympics: Coach Wild Celebration Goes Viral After Australian Swimmer Wins Gold - Sakshi

టోక్యో: ప్రస్తుత ఒలింపిక్స్‌లో భాగంగా ఇవాళ జరిగిన మహిళల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అరియార్ని టిట్మస్ స్వర్ణం గెలిచింది. ఆమె ఫినిషింగ్ లైన్ తాకడంతోనే గ్యాలరీలో ఉన్న ఆమె కోచ్ డీన్ బాక్సాల్ పూనకం వచ్చినవాడిలా ఊగిపోయాడు. తన శిష్యురాలు పసిడి సాధించిందన్న ఆనందం ఆయనలో కట్టలు తెంచుకుంది.

కేకలు, అరుపులతో గ్యాలరీలో హంగామా సృష్టించాడు. బాక్సాల్ ఉద్రేకాన్ని చూసి అక్కడే ఉన్న ఓ ఒలింపిక్స్ ఉద్యోగిని హడలిపోయింది. ఆ ఊపులో ఎక్కడ గ్యాలరీ నుంచి కిందికి దూకేస్తాడేమోనని ఆమె చేతులు అడ్డుపెట్టే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఆసీస్‌ మొత్తం ఆరు పతకాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో రెండు పసిడి, ఓ రజతం​, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement