South Zone Aquatic Championship-2019
-
వ్యక్తిగత చాంప్స్ రుత్విక్, సుహాస్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు రుత్విక్ రెడ్డి, ఎం. సుహాస్ ప్రీతమ్ సత్తా చాటారు. గచ్చిబౌలిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో గ్రూప్–1 బాలుర వ్యక్తిగత ఈవెంట్లో రుత్విక్ రెడ్డి, గ్రూప్–3 బాలుర కేటగిరీలో సుహాస్ ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. బాలుర విభాగంలో రుత్విక్, బాలికల విభాగంలో సువన భాస్కర్ చెరో 35 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. గ్రూప్–3 విభాగంలో సుహాస్ ప్రీతమ్, రేణుకాచార్య తలా 26 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. టీమ్ విభాగంలో కర్ణాటక 1279 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, తమిళనాడు 611 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పోటీల్లో తెలంగాణ స్విమ్మర్లు 4 రజతాలు, ఒక కాంస్యాన్ని గెలుచుకున్నారు. గ్రూప్–2 బాలుర 200 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో బి. సాయి నిహార్ (2ని:23.13సె.), గ్రూప్–1 బాలుర 200మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో వై. జశ్వంత్ రెడ్డి (2ని:18.68సె.), 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్‌లో సూర్యాన్షు (1ని:12.32సె.), 400మీ. ఫ్రీస్టయిల్లో సీహెచ్ అభిలాశ్ (4ని:26.12సె.) తలా ఓ రజతాన్ని సాధించారు. జాహ్నవి గోలి గ్రూప్–1 బాలికల 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ను 2నిమిషాల 43.36 సెకన్లలో పూర్తిచేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు 2 పతకాల్ని సాధించారు. గ్రూప్–4 బాలుర 100మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఎం. యజ్ఞసాయి (1ని:7.08సె.), గ్రూప్–2 బాలికల 100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో వి. నాగ గ్రీషి్మణి (1ని:25.41సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, నార్సింగి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఓవరాల్ చాంపియన్ కర్ణాటక
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కర్ణాటక జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 1279 పాయింట్లు సాధించిన కర్ణాటక జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో కర్ణాటక, తమిళనాడు జట్లు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగం ఓవరాల్ చాంపియన్‌షిప్ జాబితాలో గ్రూప్–1 విభాగంలో రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సువన భాస్కర్ (కర్ణాటక)... గ్రూప్–2 విభాగంలో ఉత్కర్ష్ వెంకటేశ్ (కర్ణాటక), నైనా వెంకటేశ్ (కర్ణాటక)... గ్రూప్–3 కేటగిరీలో సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ), రేణుకాచార్య (కర్ణాటక), గ్రూప్–4 కేటగిరీలో పీవీ మోనిశ్ (కర్ణాటక), ధినిధి డేసింగు (కర్ణాటక) వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. తమిళనాడు జట్టు చివరి రోజు ఈవెంట్ల ఫలితాలు 1500మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2 బాలురు: 1. సర్వేపల్లి కృష్ణ ప్రణవ్ (తమిళనాడు), 2. శివాంక్ విశ్వనాథ్(కర్ణాటక), 3. సంజిత్ (కర్ణాటక); బాలికలు: 1. అష్మిత చంద్ర (కర్ణాటక), 2. మహాలక్ష్మి (తమిళనాడు), 3. మేధ వెంకటేశ్ (కర్ణాటక). 400మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 బాలురు: 1. సమర్థ రావు (కర్ణాటక), 2. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ), 3. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. ప్రీత వెంకటేశ్ (కర్ణాటక), 2. నిధి శశిధర (కర్ణాటక), 3. మిధుల జితేశ్ (కేరళ). 200మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్ష్ పాటిల్ (కర్ణాటక), 2. సాయి నిహార్ (తెలంగాణ), 3. అక్షయ్ (కర్ణాటక); బాలికలు: 1. సనా మాథ్యూ (కేరళ), 2. నైషా శెట్టి (కర్ణాటక), మణి జాధవ్ (కర్ణాటక). గ్రూప్–1 బాలురు: 1. డారెల్ స్టీవ్ (తమిళనాడు), 2. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ), 3. దీప్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. సువన (కర్ణాటక), 2. భూమిక (కర్ణాటక), 3. జాహ్నవి (తెలంగాణ). 100మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–4 బాలురు: 1. మోనిశ్ (కర్ణాటక), 2. సాయి ఆదిత్య (తమిళనాడు), 3. యజ్ఞ సాయి (ఆంధ్రప్రదేశ్); బాలికలు: 1. ధినిధి డేసింగు (కర్ణాటక), 2. క్యారెన్ బెన్నీ (కేరళ), 3. ప్రమితి (తమిళనాడు). 100మీ. బ్రెస్ట్ స్ట్రోక్ గ్రూప్–2 బాలురు: 1. జాషువా థామస్, 2. విదిత్ శంకర్, 3. శుభాంగ్ కుబేర్; బాలికలు: 1. హితైశ్ (కర్ణాటక), 2. అన్విత (కర్ణాటక), 3. నాగ గ్రీష్మిణి(ఆంధ్రప్రదేశ్). గ్రూప్–1 బాలురు: 1. లితీశ్ గౌడ్ (కర్ణాటక), 2. సూర్యాన్షు (తెలంగాణ), 3. గిరిధర్ (కేరళ). రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ) -
రాణించిన తెలంగాణ స్విమ్మర్లు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు రాణించారు. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో పోటీలకు రెండోరోజు శనివారం పలు ఈవెంట్లలో పాల్గొన్న తెలంగాణ స్విమ్మర్లు ఒక స్వర్ణం, 4 రజతాలు, 4 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు రెండు పతకాలు లభించాయి. ఈవెంట్ల వారీగా విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 800 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 బాలురు: 1. దీప్ వెంకటేశ్ (కర్ణాటక), 2. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక), 3. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ); బాలికలు: 1. నిధి (కర్ణాటక), 2. అనుమతి చౌగులే (కర్ణాటక), 3. కవియా (తమిళనాడు). గ్రూప్–2 బాలురు: 1. సర్వేపల్లి కృష్ణప్రణవ్ (తమిళనాడు), 2. శివాంక్ విశ్వనాథ్ (కర్ణాటక), 3. సంజిత్ (కర్ణాటక); బాలికలు: 1. అశ్మిత చంద్ర (కర్ణాటక), 2. వృత్తి అగర్వాల్ (తెలంగాణ), 3. రితిక (కర్ణాటక). గ్రూప్–3 బాలురు: 1. ఆర్. నవనీత్ (కర్ణాటక), 2. సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ), 3. తనవ్ భరద్వాజ్ (కర్ణాటక); బాలికలు: 1. హషిక (కర్ణాటక), 2. విహిత (కర్ణాటక), 3. రోషిణి (తమిళనాడు). 200 మీ. వ్యక్తిగత మెడ్లే గ్రూప్–1 బాలురు: 1. రాజ్ వినాయక్ (కర్ణాటక), 2. లితీశ్ గౌడ (కర్ణాటక), 3. విశ్వాస్ రెడ్డి (తెలంగాణ); బాలికలు: 1.జాహ్నవి (తెలంగాణ) 2. గుణ్ మత్తా (కర్ణాటక), 3. అనుమతి (కర్ణాటక). గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్‡్ష (కర్ణాటక), 2. సాయి నిహార్ (తెలంగాణ), 3. తరుణ్ అరుణ్ (కర్ణాటక); బాలికలు: 1. లక్ష్య (కర్ణాటక), 2. నైషా షెట్టి (కర్ణాటక), 3. శ్రీయ మేరీ కమల్ (కేరళ). గ్రూప్–4 బాలురు: 1. సాయి ఆదిత్య (తమిళనాడు), 2. మోనిశ్ (కర్ణాటక), 3. గౌతమ్ శశివర్ధన్ (తెలంగాణ); బాలికలు: 1. ధినిధి డేసింగు (కర్ణాటక), 2. మెహ్రీన్ (కేరళ), 3. అలంకృతి (ఆంధ్రప్రదేశ్). 100 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–1 బాలురు: 1. రాజ్ వినాయక్ (కర్ణాటక), 2. సుదర్శన్ (కర్ణాటక), 3. విశ్వాస్ రెడ్డి (తెలంగాణ); బాలికలు: 1. విద్యశ్రీ (కర్ణాటక), 2. ఇన్చర (కర్ణాటక), 3. మరియా పడయత్ (కేరళ). గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్ష్ (కర్ణాటక), నయన్ విఘ్నేశ్ (కర్ణాటక), 3. కార్తికేయన్ (తమిళనాడు); బాలికలు: 1. నైనా (కర్ణాటక), 2. సంజన (తెలంగాణ), 3. అన్షు దేశ్‌పాండే (కర్ణాటక). గ్రూప్–3 బాలురు: 1. రేణుకాచార్య (కర్ణాటక), 2. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్), 3. ఆర్యన్ పాటిల్ (కర్ణాటక); బాలికలు: 1. హషిక (కర్ణాటక), 2. సాబా సుహానా (కర్ణాటక), 3. రోషిణి (తమిళనాడు). -
గచ్చిబౌలిలో సౌత్‌జోన్ స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
-
కర్ణాటక స్విమ్మర్ల పతకాల పంట
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల తొలి రోజు కర్ణాటక స్విమ్మర్లు పతకాల పంట పండించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో మొదటి రోజు ఏకంగా కర్ణాటక స్విమ్మర్లు 32 ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొత్తం 40 వేర్వేరు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 16 పతకాలు, ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 8 పతకాలు లభించాయి. తెలంగాణ పతకాల జాబితాలో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు ఉండగా... ఏపీ పతకాల్లో 2 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. ఏపీకి మొదటి రోజు స్వర్ణం దక్కలేదు. ఆదివారం వరకు అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ కొనసాగుతుంది. తెలంగాణ తరఫున బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్ గ్రూప్–1, బాలుర 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ గ్రూప్–1 ఈవెంట్లలో ఎస్. రుత్విక్ నాగిరెడ్డి స్వర్ణాలు గెలుచుకోవడం విశేషం. బాలికల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ గ్రూప్–2 ఈవెంట్లో కె. సంజనకు బంగారు పతకం లభించింది. తొలి రోజు ఫలితాలు బాలుర విభాగం: 1500 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. దీప్ వెంకటేశ్ గిల్డా (కర్ణాటక–17 ని.13.42 సె.), 2. సమర్థ రావు (కర్ణాటక), 3. సాయి గణేశ్ (తమిళనాడు). 400 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. సర్వేపల్లి కృష్ణ్ణ (తమిళనాడు–4ని. 25.97 సె.), 2. తరుణ్ గౌడ (కర్ణాటక), 3. శివాంక్ విశ్వనాథ్ (కర్ణాటక). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–3 : 1. రేణుకాచార్య (కర్ణాటక–2 ని. 24.66 సె.), 2. లోకేశ్ రెడ్డి (కర్ణాటక), 3. డి. వర్షిత్ (తెలంగాణ). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. లితీశ్ గౌడ (కర్ణాటక–2 ని. 35.48 సె.), 2. అన్బు కథీర్ (తమిళనాడు), 3. బి. సూర్యాంశు (తెలంగాణ). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. జాషువా థామస్ (తమిళనాడు–2 ని. 34.76 సె.), 2. శుభాంగ్ కుబేర్ (కర్ణాటక), 3. విదిత్ శంకర్ (కర్ణాటక). 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. నవనీత్ గౌడ (కర్ణాటక–1ని. 24.65 సె.), 2. యష్ కార్తీక్ (కర్ణాటక), 3. దర్శన్ (తమిళనాడు). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–4: 1.ఎస్. శ్రీనివాస్ (తమిళనాడు–40.68 సె.), 2. యష్‌రాజ్ (కర్ణాటక), 3. ఎంఎస్ నితీశ్ (తమిళనాడు). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–1: 1. సాయి సమర్థ్ (కర్ణాటక–27.62 సె.), 2. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక), 3. బి. సూర్యాంశు (తెలంగాణ). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–2: 1. నయన్ విఘ్నేశ్ (కర్ణాటక–28.18 సె.), 2. కార్తికేయన్ నాయర్ (కర్ణాటక), 3. అవినాశ్ (తమిళనాడు). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. ఎస్. రుత్విక్ నాగిరెడ్డి (తెలంగాణ–2ని. 0.96 సె.), 2. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక), 3. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. తరుణ్ గౌడ (కర్ణాటక–2 ని. 6.53 సె.), 2. సర్వేపల్లి కృష్ణ్ణ (తమిళనాడు), 3. అక్షయ్ (కర్ణాటక). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. యష్ కార్తీక్ (కర్ణాటక–1 ని. 12.97 సె.), 2. ఆర్యన్ అప్టిల్ (కర్ణాటక), 3. ఎం.తీర్థు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. ఎస్. రుత్విక్ నాగిరెడ్డి (తెలంగాణ–1 ని. 3.92 సె.), 2. వై. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ), 3. డారెల్ స్టీవ్ (తమిళనాడు). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. ఉత్కర్‡్ష పాటిల్ (కర్ణాటక–1 ని. 4.50 సె.), 2. అక్షయ్ (కర్ణాటక), 3. ఎస్. ఆకాశ్ (తమిళనాడు). 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–4: 1. గోకులన్ (తమిళనాడు–36.86 సె.), 2. సర్వేపల్లి ఆదిత్య (తమిళనాడు), 3. శ్రీహరి కత్తి (కర్ణాటక). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. అర్జున్ శంభు (కేరళ–30.38 సె.), 2. లితీశ్ గౌడ (కర్ణాటక), 3. బి. సూర్యాంశు (తెలంగాణ). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. విదిత్ శంకర్ (కర్ణాటక–33.21 సె.), 2. షాన్ ఆంటోనీ (కేరళ), 3. జాషువా థామస్ (తమిళనాడు). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. భువన్ రుద్రరాజు (కర్ణాటక–37.91 సె.), 2. నవనీత గౌడ (కర్ణాటక), 3. యష్ రాఠీ (ఆంధ్రప్రదేశ్). 4–200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 రిలే: 1. కర్ణాటక, 2. తెలంగాణ, 3. కేరళ. 4–50 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–4 రిలే: 1. కర్ణాటక, 2. తమిళనాడు, 3. తెలంగాణ బాలికల విభాగం: 1500 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. నిధి శశిధర (కర్ణాటక–20 ని.12.88 సె.), 2. అనుమతి చౌగ్లే (కర్ణాటక), 3. ఎస్.కావ్య (తమిళనాడు). 400 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. అష్మిత చంద్ర (కర్ణాటక–4 ని. 53.24 సె.), 2. వృత్తి అగర్వాల్ (తెలంగాణ), 2. కె. సంజన (తెలంగాణ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–3: 1. హషిక (కర్ణాటక–2 ని. 27.30 సె.), 2. సబా సుహానా (కర్ణాటక), జి. శర్ష (తెలంగాణ). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. గున్ మటా (కర్ణాటక–2 ని 56.16 సె.), 2. ఆరాధన (కేరళ), 3. షానియా గ్రేస్ (కర్ణాటక). 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. హితైషి (కర్ణాటక–2ని. 55.29 సె.), 2. అన్విత గౌడ (కర్ణాటక), 3. వి. నాగ గ్రీష్మిణి (ఆంధ్రప్రదేశ్). 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. విహిత నయన (కర్ణాటక–1 ని. 22.37 సె.), 2. మనవి వర్మ (కర్ణాటక), 3. ఎన్. పావని సరయు (ఆంధ్రప్రదేశ్). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–4: 1. ధీనిధి (కర్ణాటక–39.53 సె.), 2. ఆకతి మాలిని (తమిళనాడు), 3. అక్షర (తమిళనాడు). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–1: 1. సువన భాస్కర్ (కర్ణాటక–29.64 సె.), 2. ఇన్చర (కర్ణాటక), 3. కప (కేరళ). 50 మీ. బటర్‌ఫ్లయ్ గ్రూప్–2: 1. నీనా వెంకటేశ్ (కర్ణాటక–30.11 సె.), 2. రిషిక మంగ్లే (కర్ణాటక), 3. కె. సంజన (తెలంగాణ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1: 1. బి. ఇన్చర (కర్ణాటక–2 ని. 22.33 సె.), 2. ప్రీత వెంకటేశ్ (కర్ణాటక), 3. నిర్మల (కేరళ). 200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–2: 1. కె. సంజన (తెలంగాణ–2 ని. 18. 27 సె.), 2. అష్మిత చంద్ర (కర్ణాటక), 3. హిత ఆనంద్ (కర్ణాటక). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. మానవి వర్మ (కర్ణాటక–1 ని. 16. 53 సె.), 2. నక్షత్ర గౌతమ్ (కర్ణాటక), 3. ఎస్. సంధ్య (తమిళనాడు). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. సువన భాస్కర్ (కర్ణాటక–1 ని. 9.66 సె.), 2. భూమిక (కర్ణాటక), 3. జాహ్నవి గోలి (తెలంగాణ). 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. నీనా వెంకటేశ్ (కర్ణాటక–1 ని. 11.09 సె.), 2. నైషా శెట్టి (కర్ణాటక), 3. అక్షిత (తమిళనాడు). 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–4: 1. ధీనిధి (కర్ణాటక–36. 27 సె.), 2. బి. అలంకృతి (ఆంధ్రప్రదేశ్), 3. ప్రమితి జ్ఞానశేఖరన్ (తమిళనాడు). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–1: 1. గున్ మత్తా (కర్ణాటక–37. 77 సె.), 2. ఆరాధన (కేరళ), 3. షానియా గ్రేస్ (కర్ణాటక). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–2: 1. అన్విత గౌడ (కర్ణాటక–36.56 సె.), 2. వి. నాగ గ్రీష్మిణి (ఆంధ్రప్రదేశ్), 3. హితైషి (కర్ణాటక). 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ గ్రూప్–3: 1. విహిత నయన (కర్ణాటక–37. 55 సె.), 2. మానవి వర్మ (కర్ణాటక), 3. ఎన్. పావని సరయు (ఆంధ్రప్రదేశ్). 4–200 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–1 రిలే: 1. కర్ణాటక, 2. కేరళ, 3. తమిళనాడు. 4–50 మీ. ఫ్రీస్టయిల్ గ్రూప్–4 రిలే: 1. కర్ణాటక, 2. తమిళనాడు, 3. ఆంధ్రప్రదేశ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సౌత్‌జోన్ స్విమ్మింగ్ టోర్నీకి రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అక్వాటిక్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది స్విమ్మర్లు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్విమ్మర్లు పతకం కోసం పోటీపడనున్నారు. బాలబాలికల కేటగిరీలలో ఫ్రీస్టయిల్, మెడ్లీ, బటర్‌ఫ్లయ్, బ్యాక్‌స్ట్రోక్, రిలే ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి. ఇందులో పాల్గొనే క్రీడాకారులను వయస్సు ప్రకారం గ్రూప్–1 (15, 16, 17 వయస్సు), గ్రూప్–2 (12, 13, 14 వయస్సు), గ్రూప్–3 (11 వయస్సు), గ్రూప్–4 (9, 10 వయస్సు)గా విభజించారు. తెలంగాణ నుంచి మొత్తం 105 మంది స్విమ్మర్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 52 మంది బాలికలు, 53 మంది బాలురు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగనున్న టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభిస్తారు. తెలంగాణ జట్ల వివరాలు బాలికలు: ఇష్వి మతాయ్, ఎం. ప్రణతి, డి.సాయి కీర్తన, పి. స్తుతిశ్రీ, టి. సంవేద, నిషా గణేశ్, ఆయుషి గుప్తా, శ్రేయ పంజల, జాహ్నవి, పి. సింధుజ, డీఎం హర్షిత, ఫతీకా, సుదీక్ష, శ్రీమణి, కాత్యాయని, కశ్యపి, కె. సంజన, వృత్తి అగర్వాల్, సరయు రెడ్డి, వాణి జిందాల్, హాసిని రెడ్డి, ఎం. రిత్విక, ఆస్థ, జి. రాజలక్ష్మి, పి. చిన్మయి రెడ్డి, యోగిత, జి. రాజ్శ్రీ లాస్య, ప్రీతి సుసాన్, ఎ. మోక్షిత, వేదశ్రీ ఉప్పాల, శ్రీజని, గనగశ్రీ, హేమన్వర్షిణి, కె. సుదీక్ష, శ్రీ నిత్య, డి. రీతు, అదితి, టి. సాయి ప్రజ్ఞ, ఖనక్ జైన్, పి.షినేష్మ, ఇషితా రసమయి, అభిచందన, సిమ్రన్ పటేల్, కె. వర్షిణి ప్రియ, అక్షిత, కర్ణిక గుప్తా, నిహారిక, దీక్షిత, ఎస్. తేజస్వి, ఎన్. స్ఫూర్తి, వర్ష. బాలురు: రుత్విక్ రెడ్డి, టి. సాయి తరుణ్, సీహెచ్ అభిలాష్, వై. జశ్వంత్ రెడ్డి, వై. చార్లెస్ ఫిన్నే, వి. సాయి ప్రణీత్ కుమార్, కె. రాఘవేంద్ర, దువాన్‡్ష శర్మ, సాయి ప్రణయ్, సూర్యాన్షు బాషా, ఎం. విశ్వాస్ రెడ్డి, దిగ్విజయ్, అభిషేక్, పి. త్రిషిక్, ఎస్. రాజ్ లిఖిత్, బి. సాయి నిహార్, ఎన్. మహర్షిత్, ఎం. హనుమాన్, మొహమ్మద్ కమిలుద్దీన్, అర్జున్, ఆర్. సాత్విక్ రాజ్, ఇషాన్దూబే, ఉదిత్ కొతారి, కె. శశిధర్ రెడ్డి, ఇషాన్ అరోరా, అవినాశ్ కుమార్, ఆశ్రిత్ కుమార్, సుహాస్ ప్రీతమ్, జోర్డాన్ డోమ్నిక్ ఫ్రాంక్లిన్, అక్షిత్, వర్షిత్, స్టాష్ జోసెఫ్, ఎస్ఎస్ ప్రజ్వల్, హర్షిత్, వివేకానంద రెడ్డి, బి. గౌతమ్ శశివర్ధన్, అభయ్, తేజస్ కుమార్, నమన్, యశస్వీ, కె. సుజల్, కె. లలిత్ సాగర్, కె. రోహన్ రెడ్డి, ఆర్యమన్ సింగ్ పటేల్, జి. కార్తీక్, కె. మనీశ్ గౌడ్, పి. ఆదిత్య రాయ్, ఎం. అభిషేక్, జ్వాల తనయ్ సింగ్, అనిల్ శ్రీవాస్తవ్, జె. సాయితేజ, నవీన్ కృష్ణ, ఎల్. మణిదీప్.