సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన కర్ణాటక జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 1279 పాయింట్లు సాధించిన కర్ణాటక జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో కర్ణాటక, తమిళనాడు జట్లు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగం ఓవరాల్ చాంపియన్‌షిప్ జాబితాలో గ్రూప్–1 విభాగంలో రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సువన భాస్కర్ (కర్ణాటక)... గ్రూప్–2 విభాగంలో ఉత్కర్ష్ వెంకటేశ్ (కర్ణాటక), నైనా వెంకటేశ్ (కర్ణాటక)... గ్రూప్–3 కేటగిరీలో సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ), రేణుకాచార్య (కర్ణాటక), గ్రూప్–4 కేటగిరీలో పీవీ మోనిశ్ (కర్ణాటక), ధినిధి డేసింగు (కర్ణాటక) వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు.
తమిళనాడు జట్టు
చివరి రోజు ఈవెంట్‌ల ఫలితాలు
1500మీ. ఫ్రీస్టయిల్
గ్రూప్–2 బాలురు: 1. సర్వేపల్లి కృష్ణ ప్రణవ్ (తమిళనాడు), 2. శివాంక్ విశ్వనాథ్(కర్ణాటక), 3. సంజిత్ (కర్ణాటక); బాలికలు: 1. అష్మిత చంద్ర (కర్ణాటక), 2. మహాలక్ష్మి (తమిళనాడు), 3. మేధ వెంకటేశ్ (కర్ణాటక).
400మీ. ఫ్రీస్టయిల్
గ్రూప్–1 బాలురు: 1. సమర్థ రావు (కర్ణాటక), 2. సీహెచ్ అభిలాష్ (తెలంగాణ), 3. మోహిత్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. ప్రీత వెంకటేశ్ (కర్ణాటక), 2. నిధి శశిధర (కర్ణాటక), 3. మిధుల జితేశ్ (కేరళ).
200మీ. బ్యాక్‌స్ట్రోక్
గ్రూప్–2 బాలురు: 1. ఉత్కర్ష్ పాటిల్ (కర్ణాటక), 2. సాయి నిహార్ (తెలంగాణ), 3. అక్షయ్ (కర్ణాటక); బాలికలు: 1. సనా మాథ్యూ (కేరళ), 2. నైషా శెట్టి (కర్ణాటక), మణి జాధవ్ (కర్ణాటక).
గ్రూప్–1 బాలురు: 1. డారెల్ స్టీవ్ (తమిళనాడు), 2. జశ్వంత్ రెడ్డి (తెలంగాణ), 3. దీప్ వెంకటేశ్ (కర్ణాటక); బాలికలు: 1. సువన (కర్ణాటక), 2. భూమిక (కర్ణాటక), 3. జాహ్నవి (తెలంగాణ).
100మీ. ఫ్రీస్టయిల్
గ్రూప్–4 బాలురు: 1. మోనిశ్ (కర్ణాటక), 2. సాయి ఆదిత్య (తమిళనాడు), 3. యజ్ఞ సాయి (ఆంధ్రప్రదేశ్); బాలికలు: 1. ధినిధి డేసింగు (కర్ణాటక), 2. క్యారెన్ బెన్నీ (కేరళ), 3. ప్రమితి (తమిళనాడు).
100మీ. బ్రెస్ట్ స్ట్రోక్
గ్రూప్–2 బాలురు: 1. జాషువా థామస్, 2. విదిత్ శంకర్, 3. శుభాంగ్ కుబేర్; బాలికలు: 1. హితైశ్ (కర్ణాటక), 2. అన్విత (కర్ణాటక), 3. నాగ గ్రీష్మిణి(ఆంధ్రప్రదేశ్).
గ్రూప్–1 బాలురు: 1. లితీశ్ గౌడ్ (కర్ణాటక), 2. సూర్యాన్షు (తెలంగాణ), 3. గిరిధర్ (కేరళ).
రుత్విక్ రెడ్డి (తెలంగాణ), సుహాస్ ప్రీతమ్ (తెలంగాణ)
ఓవరాల్ చాంపియన్ కర్ణాటక
Published Mon, Jan 6 2020 12:06 AM | Last Updated on Mon, Jan 6 2020 12:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment