సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్ప్రింట్స్‌లో తెలంగాణ కుర్రాడు అబ్దుల్ నజీబ్ ఖురేషీ మెరిశాడు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 100 మీటర్ల పరుగులో నజీబ్ రజత పతకం గెలుచుకున్నాడు. 10.63 సెకన్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. షమీర్ మోన్ (మణిపూర్-10.60 సె.) స్వర్ణ పతకం సాధించగా, అనిరుధ గుంజాయ్ (మహారాష్ట్ర-10.66 సె.)కు కాంస్యం దక్కింది.