
గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గదులను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు
గచ్చిబౌలి : గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ వార్డును సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ విలేజ్‌లోని కాంప్లెక్స్‌ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సందర్శించారు. సోమవారం 100 మంది జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం కార్మికులు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని అంతస్తులను శుభ్రం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మెడికల్ ఆఫీసర్ ఐసోలేషన్ వార్డును పర్యవేక్షణ చేయనున్నారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళను ఐసోలేషన్ వార్డుకు నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment