
అద్భుతమైన సంగీతంతో మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సిటీని ఉర్రూతలూగించాడు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రెహమాన్ మ్యూజిక్ ప్రోగ్రాంకు భారీ సంఖ్యలో సంగీతప్రియులు హాజరయ్యారు. ఈ షోలో పలువురు గాయనీ గాయకులు పాలుపంచుకున్నారు.
గచ్చిబౌలి స్టేడియం సంగీత మాంత్రికుడి మాయలో ఓలలాడింది. పాటల సందడిలో మునిగిపోయింది. ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తాఫా అంటూ.. ఏఆర్ రెహమాన్ తన పాటలతో మైమరిపించాడు. ఆదివారం రెహమాన్ సంగీత ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు. జెంటిల్మన్, ప్రేమికుడు వంటి సినిమాల్లోని హిట్ సాంగ్స్ తో వీనులవిందు చేశాడు. వేదిక లేజర్ కాంతులతో కొత్త శోభను సంతరించుకుంది. వందేమాతరం పాటకు స్టేడియం ప్రాంగణం మొత్తం ఉద్వేగంతో కదిలిపోయింది. దాదాపు రెండున్నర గంటలపాటు షో కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment