Music Performance
-
రెహమానియా
అద్భుతమైన సంగీతంతో మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సిటీని ఉర్రూతలూగించాడు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రెహమాన్ మ్యూజిక్ ప్రోగ్రాంకు భారీ సంఖ్యలో సంగీతప్రియులు హాజరయ్యారు. ఈ షోలో పలువురు గాయనీ గాయకులు పాలుపంచుకున్నారు. గచ్చిబౌలి స్టేడియం సంగీత మాంత్రికుడి మాయలో ఓలలాడింది. పాటల సందడిలో మునిగిపోయింది. ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తాఫా అంటూ.. ఏఆర్ రెహమాన్ తన పాటలతో మైమరిపించాడు. ఆదివారం రెహమాన్ సంగీత ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు. జెంటిల్మన్, ప్రేమికుడు వంటి సినిమాల్లోని హిట్ సాంగ్స్ తో వీనులవిందు చేశాడు. వేదిక లేజర్ కాంతులతో కొత్త శోభను సంతరించుకుంది. వందేమాతరం పాటకు స్టేడియం ప్రాంగణం మొత్తం ఉద్వేగంతో కదిలిపోయింది. దాదాపు రెండున్నర గంటలపాటు షో కొనసాగింది. -
అందరి ప్రేమతోనే...
మల్టిపుల్ టాలెంట్స్తో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఫరాన్ అక్తర్ తొలిసారి హైదరాబాద్లో తన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చాడు. ఈ సందర్భంగా కాసేపు మీడియాతో ముచ్చటించాడు. యాక్టర్, పర్ఫార్మర్, డెరైక్టర్, రైటర్, సింగర్ ఇలా తన ప్రతిభను ఎన్నో విధాలుగా ప్రదర్శించిన ఫరాన్ ఇక ముందు ఇంకా ఏం చెయ్యబోతున్నారు అన్న ప్రశ్నకు... ఇవన్నీ చాలవా.. ఇంకా కొత్తవి చేయాలంటారా అని చమత్కరించాడు. అలాగే తను చేసే ప్రతి పనినీ ఎంజాయ్ చేస్తుంటానని... ఇందుకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఉత్సాహాన్ని నింపుతారని అన్నాడు. వారి ప్రేమ, సపోర్ట్ వల్లే అన్ని పనులు చేయగలుగుతున్నానన్నారు. యూఎన్ విమెన్ గుడ్విల్ అంబాసిడర్గా ఉన్న ఫరాన్... దేశంలో స్త్రీల భద్రత గురించి జరుగుతున్న విస్తృత చర్చ తప్పకుండా పరిష్కార దిశగా అడుగులు వేయిస్తుందని అభిప్రాయపడ్డాడు.