అందరి ప్రేమతోనే... | all love with we... | Sakshi
Sakshi News home page

అందరి ప్రేమతోనే...

Published Sun, Nov 30 2014 10:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అందరి ప్రేమతోనే... - Sakshi

అందరి ప్రేమతోనే...

మల్టిపుల్ టాలెంట్స్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఫరాన్ అక్తర్ తొలిసారి హైదరాబాద్‌లో తన మ్యూజిక్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చాడు. ఈ సందర్భంగా కాసేపు మీడియాతో ముచ్చటించాడు. యాక్టర్, పర్‌ఫార్మర్, డెరైక్టర్, రైటర్, సింగర్ ఇలా తన ప్రతిభను ఎన్నో విధాలుగా ప్రదర్శించిన ఫరాన్ ఇక ముందు ఇంకా ఏం చెయ్యబోతున్నారు అన్న ప్రశ్నకు... ఇవన్నీ చాలవా.. ఇంకా కొత్తవి చేయాలంటారా అని చమత్కరించాడు.

అలాగే తను చేసే ప్రతి పనినీ ఎంజాయ్ చేస్తుంటానని... ఇందుకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఉత్సాహాన్ని నింపుతారని అన్నాడు. వారి ప్రేమ, సపోర్ట్ వల్లే అన్ని పనులు చేయగలుగుతున్నానన్నారు. యూఎన్ విమెన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ఫరాన్... దేశంలో స్త్రీల భద్రత గురించి జరుగుతున్న విస్తృత చర్చ తప్పకుండా
 పరిష్కార దిశగా అడుగులు వేయిస్తుందని అభిప్రాయపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement