రన్ అండ్ స్విమ్ | Run and Swim at city | Sakshi
Sakshi News home page

రన్ అండ్ స్విమ్

Published Mon, Oct 13 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

రన్ అండ్ స్విమ్

రన్ అండ్ స్విమ్

కొలనులో ఈత కొట్టేసి... రోడ్లపై పరుగు పెట్టేసి... సైకిల్‌పై సవారీ చేసేసి... రెగ్యులర్ బీట్‌తో బోరెత్తిపోయిన సిటీజనులు ఈ ఆదివారాన్ని విభిన్నంగా ఎంజాయ్ చేశారు. గచ్చిబౌలి స్టేడియం, శంకర్‌పల్లి ఇక్‌ఫైలలో నిర్వహించిన ‘హైదరాబాద్ ట్రయథ్లాన్’ పోటీల్లో పిల్లలు, యువతే కాదు... ఏడు పదులు దాటిన గ్రాండ్ ఫాదర్స్ కూడా పోటీపడి సిటీ స్పిరిట్ ఏంటో చూపారు.

వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌కు... ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెషనల్ క్రీడాకారులు, ఔత్సాహికులు కూడా తరలివచ్చారు. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌తో పాటు హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ కొత్తగా పరిచయం చేసిన 3/4 ఐరన్, పవర్ డువథ్లాన్ మరింత జోష్ పెంచాయి. ‘నలభై ఏళ్ల వయసు నుంచీ అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్నా. యువతకు రోల్ మోడల్‌గా ఉండాలన్నదే నా తాపత్రయం’ అని ఈ పోటీలో పాల్గొన్న 75 ఏళ్ల వృద్ధుడు, ఎంఎల్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement