Marri Laxman Reddy
-
'సాక్షి ప్రీమియర్ లీగ్' విజేతలకు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’(ఎస్పీఎల్) తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎస్పీఎల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫైనల్లో విజేతలుగా నిలిచిన ఎంఎల్ఆర్ఐటి(సీనియర్స్ విభాగం) , గౌతమ్ జూనియర్ కాళాశాల(జూనియర్స్ విభాగం) జట్లకు రూ. 25 వేలు, రన్నరప్‌గా నిలిచిన వాగ్దేవి, కెఎల్ఎన్ జట్లకు రూ. 15 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, మెడల్స్, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. అదే విధంగా జూనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రిషబ్ బిమల్, సీనియర్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్ దక్షిత్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సూర్యతేజలను మెమెంటోలతో సత్కరించారు.కాగా సాక్షి మీడియా గ్రూఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎస్పీఎల్ నిర్వహణపై పలువురు ప్రశంసల జల్లు కుపించారు. 'విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి కనబర్చాలని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉత్తమంగా రాణిస్తారు. ఎస్పీఎల్ లీగ్ నిర్వహించడం అభినందనీయం' -ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 'ఎస్పీఎల్ అభినందనీయం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 649 జట్లతో రాష్ట్ర స్థాయిలో ఎస్పీఎల్ నిర్వహించడం గొప్ప విషయం. అందుకు మా కాలేజీ ఆతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియా గ్రూఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్థతలు' - మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంఎల్ఆర్ఐటి కళాశాలల సెక్రటరీ -
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటి (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) విజేతలుగా నిలిచాయి. సీనియర్ ఫైనల్లో ఎంఎల్ఆర్ఐటి 35 పరుగుల తేడాతో వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల)పై విజయం సాధించింది. ఎంఎల్ఆర్ఐటి ముందుగా 10 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులు చేయగా, వాగ్దేవి 10 ఓవర్లలో 5 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. జూనియర్ ఫైనల్లో గౌతమ్ కాలేజి 32 పరుగులతో కేఎల్ఎన్ జూనియర్ కాలేజిని ఓడించింది. గౌతమ్ 10 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేయగా, కేఎల్ఎన్ 9.2 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. డి.మనీశ్ ఒక పరుగే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముగింపు కార్యక్రమానికి ఎంఎల్ఆర్ఐటి కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, అవినాశ్ విద్యాసంస్థల చైర్మన్ అవినాశ్, సాక్షి మార్కెటింగ్, అడ్వర్టయిజ్మెంట్ సీజీఎం కమల్ కిశోర్ రెడ్డి, సాక్షి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉగ్రగిరి రావు, ఈవెంట్ కో–ఆర్డినేటర్లు వేణు, సుమన్, కళాశాల స్పోర్ట్స్ డైరెక్టర్ పార్థసారధి పాల్గొన్నారు. -
అదిరిన ‘టెక్ ఫెస్ట్’
-
రన్ అండ్ స్విమ్
కొలనులో ఈత కొట్టేసి... రోడ్లపై పరుగు పెట్టేసి... సైకిల్‌పై సవారీ చేసేసి... రెగ్యులర్ బీట్తో బోరెత్తిపోయిన సిటీజనులు ఈ ఆదివారాన్ని విభిన్నంగా ఎంజాయ్ చేశారు. గచ్చిబౌలి స్టేడియం, శంకర్పల్లి ఇక్ఫైలలో నిర్వహించిన ‘హైదరాబాద్ ట్రయథ్లాన్’ పోటీల్లో పిల్లలు, యువతే కాదు... ఏడు పదులు దాటిన గ్రాండ్ ఫాదర్స్ కూడా పోటీపడి సిటీ స్పిరిట్ ఏంటో చూపారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌కు... ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెషనల్ క్రీడాకారులు, ఔత్సాహికులు కూడా తరలివచ్చారు. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌తో పాటు హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ కొత్తగా పరిచయం చేసిన 3/4 ఐరన్, పవర్ డువథ్లాన్ మరింత జోష్ పెంచాయి. ‘నలభై ఏళ్ల వయసు నుంచీ అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్నా. యువతకు రోల్ మోడల్‌గా ఉండాలన్నదే నా తాపత్రయం’ అని ఈ పోటీలో పాల్గొన్న 75 ఏళ్ల వృద్ధుడు, ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు.