సైనా మానియా..! | Saina nehwal Mania ..! | Sakshi
Sakshi News home page

సైనా మానియా..!

Aug 28 2013 12:17 AM | Updated on Sep 7 2018 4:39 PM

సైనా మానియా..! - Sakshi

సైనా మానియా..!

భారత్‌లో బ్యాడ్మింటన్ రాజధాని హైదరాబాద్ ఐబీఎల్‌ను విశేషంగా ఆదరించింది. ఆటకు సైనా తెచ్చిన క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. హైదరాబాద్ హాట్‌షాట్స్ మ్యాచ్‌కు గచ్చిబౌలి స్టేడియం కిక్కిరిసిపోయింది.

భారత్‌లో బ్యాడ్మింటన్ రాజధాని హైదరాబాద్ ఐబీఎల్‌ను విశేషంగా ఆదరించింది. ఆటకు సైనా తెచ్చిన క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. హైదరాబాద్ హాట్‌షాట్స్ మ్యాచ్‌కు గచ్చిబౌలి స్టేడియం కిక్కిరిసిపోయింది.
 
  సైనా... సైనా... అంటూ అభిమానులు హోరెత్తించారు.  ఫుల్ ఖుష్...: ఊహించినట్లుగానే సైనా నెహ్వాల్ మ్యాచ్‌కు అద్భుత స్పందన లభించింది.  సైనా కోర్టులో అడుగు పెట్టినప్పటినుంచి గెలిచే వరకు అభిమానుల జోష్ ఎక్కడా తగ్గలేదు.  ఆట సాగినంత సేపు ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో ఇండోర్ స్టేడియం హోరెత్తిపోయింది.
 
 మ్యాచ్ అసాంతం స్టేడియంలో కెమెరా ఫ్లాష్‌లు నిరంతరాయంగా క్లిక్‌మన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు తెచ్చుకోవడానికి ఎలాంటి నిబంధనలు అడ్డు రాకపోవడంతో ప్రతీ ప్రేక్షకుడు ఫొటోగ్రాఫర్‌గా మారిపోయాడు.
 
  క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, సినీ నటి భూమిక, మంచు లక్ష్మిలతో పాటు పలువురు సినీ రంగానికి చెందిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. మ్యాచ్ నెగ్గిన వెంటనే సైనా తన రాకెట్‌ను ప్రేక్షకుల గ్యాలరీలోకి విసిరింది. ఆ తర్వాత మైదానమంతా కలియతిరుగుతూ హాట్‌షాట్స్ టీషర్ట్‌లు స్టాండ్స్‌లోకి విసిరింది. సైనా మ్యాచ్ ముగిసిన వెంటనే చాలా మంది వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement