![Jasprit Bumrah ruled out of Champions Trophy due to injury](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/bunraha.jpg.webp?itok=3swQB5rO)
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. టాప్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ అనంతరం అతని ఫిట్‌నెస్‌పై వైద్యులు బీసీసీఐకి నివేదిక అందించారు.
ఇందులో గాయం తీవ్రతపై వివరాలు లేకున్నా... ఇప్పుడు బౌలింగ్ చేసే స్థితిలో లేడని మాత్రం స్పష్టమైంది. బుమ్రా ఆడటంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నా... ఇప్పుడు మాత్రమే బోర్డు దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా 15 మంది సభ్యుల చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి తీసుకున్నారు.
వరుణ్ కోసం యశస్వి జైస్వాల్‌ను టీమ్ నుంచి తప్పించారు. స్థిరమైన ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఉండటంతో జైస్వాల్‌పై వేటు వేయాల్సి వచి్చంది. అయితే నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్‌లుగా జైస్వాల్, సిరాజ్, శివమ్ దూబేలను ఎంపిక చేశారు. వీరు అవసరమైతేనే దుబాయ్‌కు ప్రయాణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment