బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు టీమిండియా ప్రకటన
ముంబై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును శనివారం రాత్రి ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్థానం లభించింది. ఐపీఎల్‌లో తన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న మయాంక్ యాదవ్‌కు కూడా తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది.
ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి పునరాగమనం చేశాడు. విశాఖపట్నంకు చెందిన 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి గత జూలైలో జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే జట్టును ప్రకటించాక నితీశ్ గాయపడటంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నితీశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
13 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 142.92 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు సాధించి ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్‌లో... రెండో మ్యాచ్ అక్టోబర్ 9న న్యూఢిల్లీలో... మూడో మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి.
ఆరు మార్పులు...
గత నెలలో శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో పాల్గొన్న ఆరుగురు భారత క్రికెటర్లను బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. శ్రీలంకతో సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సిరాజ్, ఖలీల్ అహ్మద్ ఆడారు. వీరి స్థానాల్లో అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లకు చోటు దక్కింది.
భారత టి20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిõÙక్ శర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
Comments
Please login to add a commentAdd a comment