Vimanam Movie OTT Streaming On Zee5 From June 30 - Sakshi
Sakshi News home page

Vimanam Movie In OTT: ఓటీటీకి వచ్చేసిన 'విమానం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Fri, Jun 30 2023 8:16 PM | Last Updated on Sat, Jul 1 2023 10:38 AM

Vimanam Movie OTT Streaming On Zee5 From June 30 - Sakshi

స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విమానం'.  శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి  ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో జూన్‌ 9న ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

(ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!)

 జూన్ 30 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement