మా ఇంట్లో అత్తలు, అక్క వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ముందు గిటార్ నేర్చుకోవాలనుకున్నాను. అందుకని శరత్ మాస్టర్ దగ్గర రెండున్నర నెలల పాటు బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత నాకు నేనుగా సొంతంగా ప్లే చేస్తూ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్‌కి పనిచేయడం వల్లే నాకు సినిమా చాన్స్ లభించింది’ అన్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఆయన సంగీతం అందించిన వెబ్ సిరీస్ వికటకవి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ట్ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత దర్శకుడు అజయ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ నేను పుట్టి పెరిగిదంతా వైజాగ్‌లోనే. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 2011 నుంచి 2018వరకు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.
→ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూన్న సమయంలో షార్ట్ ఫిల్మ్స్‌కు వర్క్ చేసేవాడిని. ఇలా చేయటం వల్ల నాకు మంచి ప్రాక్టీస్ దొరికినట్లయ్యింది. ఈ క్రమంలో ప్రదీప్ అద్వైత్ నన్ను జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్‌కు పరిచయం చేశారు. నేను అంతకు ముందు చేసిన ఓ ముప్పై సెకన్ల మ్యూజిక్ బిట్ విని నాకు జగన్నాటకం మూవీలో చాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నా తొలి అడుగు పడింది.
→ నా చిన్ననాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల నన్ను గూఢచారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వర్క్ చేయమని అడగటంతో వర్క్ చేశాను. ఆ తర్వాత క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు సినిమాలకు వర్క్ చేశాను. సేవ్ ది టైగర్స్ సీజన్1, సీజన్2లకు సంగీతాన్ని అందించాను. రీసెంట్‌గా వికటకవి సిరీస్‌కు వర్క్ చేశాను.
→ నేను సంగీతాన్నందించిన మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎం బిట్ నిర్మాత బన్నీవాస్‌కి బాగా నచ్చింది. అందుకే నాకు ఆయ్ మూవీకి వర్క్‌చేసే చాన్స్ ఇచ్చాడు. ముందుగా ఓ స్పెషల్ సాంగ్ కోసం పని చేయమని చెప్పారు. నేను కంపోజ్ చేసిన సాంగ్ బాగా నచ్చడంతో ఆ సినిమా మొత్తానికి మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చాడు. ఆయ్ వంటి కామెడీ మూవీకి బీజీఎం చేయటం మామూలు విషయం కాదు. అయితే సినిమా హిట్ అయినప్పుడు పడ్డ కష్టమంతా మరచిపోయాను.
→ ఆయ్ సినిమాకు వర్క్ చేసేటప్పుడే వికటకవి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేశాను. ఆయ్ రిలీజ్ తర్వాత మరో మూడు ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేశాను. వికటకవికి వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్టర్స్ టెక్నిషియన్.. వాళ్లకి కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వటమే నా ప్రయారిటీ.. అది ఏ జోనర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయటానికి సిద్ధమే.
→ ప్రస్తుతం త్రీరోజెస్ సీజన్ 2తో పాటు ఆహాలో మరో రెండు వెబ్ సిరీస్‌లకు వర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment