ZEE5 Funny Reply To Minister KTR Tweet On OTT Shows Advice, Tweet Viral - Sakshi
Sakshi News home page

ZEE5: కేటీఆర్‌ గారూ, ఈ సినిమాల మీద ఓ లుక్కేయండి..

Published Sun, Jul 24 2022 12:11 PM | Last Updated on Sun, Jul 24 2022 12:53 PM

ZEE5 Funny Reply To Minister KTR Tweet On OTT Shows Advice, Tweet Viral - Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే! దీంతో వైద్యులు ఆయన్ను మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ ఖాళీగా ఉండటం దేనికని, పనిలో పనిగా సినిమాలు చూస్తే పోలా అనుకున్నారు. ఓటీటీలో ఏదైనా మంచి కంటెంట్‌ ఉంటే చెప్పండని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 స్పందించింది.

'కేటీఆర్‌ గారూ.. మార్నింగ్‌ మా నీళ్ల ట్యాంక్‌తో స్టార్ట్‌ చేసి రెక్కీతో థ్రిల్‌ అవుతూ, లంచ్‌ టైంకి ఫ్యామిలీతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కంప్లీట్‌ చేసి, రాత్రికి ఆర్‌ఆర్‌ఆర్‌ మళ్లీ చూసేయండి. మీరు రికవరీ అయ్యేవరకు మేము మీకు వినోదాన్ని అందిస్తూనే ఉంటాము. మీరు అలా చూస్తూనే ఉండిపోతారు' అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: ‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement