పేదల పాలిట దేవుడు!
సాధారణంగా ఎనభై ఏళ్ల వయసులో ఎవరైనా కాటికి కాళ్లు చాపుకొంటూ కూర్చుంటారు. సాయం పడితే తప్ప తమ పనులు చేసుకోలేని స్థితిలోకి జారుకుంటారు. అలాంటి వయసులో ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన గొప్ప సమాజసేవకు నడుం కట్టాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈయన కథేంటో మనమూ తెలుసుకుందాం..!
ఈ రోజుల్లో పేదోడికి జబ్బు చేస్తే అంతే సంగతులు. ఆసుపత్రులు శ్రీమంతులకే సేవలు చేస్తారుు. ఈ వివక్ష ఓంకార్‌నాథ్ శర్మను తీవ్రంగా బాధించింది. కనీసం ఒక మాత్ర కూడా కొనలేని నిస్సహాయులను చూసి కదిలిపోయాడు. వారికోసం ఇంటింటికీ తిరిగి, వాడకుండా కాలపరిమితి దాటని టాబ్లెట్లను, టానిక్కులను సేకరించే పనిలో పడ్డాడు. ఇలా.. గత ఏడేళ్లుగా పేదవాళ్లకు మందుగోలీలు ఉచితంగా ఇస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ నోరుుడాలోని కై లాష్ హాస్పిటల్ లో బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్‌గా పనిచేసి రిటైరైన ఓంకార్‌నాథ్‌ను 2008లో జరిగిన ఒక ఘటన పూర్తిగా మార్చేసింది. ఒకసారి తూర్పు ఢిల్లీలో మెట్రో పనులు జరుగుతుంటే.. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలిపోరుుంది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యారుు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. సరైన వైద్యం లేకపోవడంతో నరకం చూశారు వాళ్లు! ఆరోజే పేదలకోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణరుుంచుకున్నాడు. అలా మెడిసిన్ బాబాగా అవతారమెత్తాడు.
మెడిసిన్ బాబా అడిగితే టాబ్లెట్లు లేవు అని ఎవరూ అనరు. అవసరం ఉన్నా సరే, వేరే తెచ్చుకుంటాంలే అని ఉన్నవన్నీ అతని చేతిలో పెడతారు. ఒకవిధంగా చెప్పాలంటే ఓంకార్ తమ వీధిలో కనిపించడమే మహాభాగ్యం అనుకుంటారంతా. అతనికి సాయపడుతున్నందుకు గర్వంగా కూడా ఉందని ప్రతీ ఒక్కరూ చెప్తుంటారు. ధనికులు ఉండే ఏరియాల కంటే.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, గవర్నమెంటు కాలనీవాసులే తన ఆశయానికి మద్దతు పలుకుతుంటారని చెబుతాడాయన.
ఓంకార్ నాథ్ చేసే పని అంత సులభం కాదు. ఎన్నో అవాంతరాలు. అంతెందుకు అతను ఉంటున్న ఇల్లు కూడా సొంతం కాదు. భార్య, కొడుకు ఉన్నారు. విషాదం ఏంటంటే 45 ఏళ్ల తన కుమారుడు మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్.
నెలకు ఎంత లేదన్నా 4 నుంచి 6 లక్షల విలువైన మెడిసిన్‌స పంచుతాడు ఈ బాబా. ఆనోటా ఈనోటా విని మీడియా ఓంకార్‌నాథ్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలా మెడిసిన్ బాబాగా పాపులర్ అయ్యాడు. జనం కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకుని కాలేజీలు, గుళ్ల దగ్గర మెడిసిన్ కలెక్షన్ బాక్సులు పెట్టి మందులు సేకరిస్తున్నారు. ఈ మెడిసిన్ బాబాను పేదలపాలిట దేవుడు అంటే తప్పేం ఉండదేమో!