అమెజాన్, వోడాఫోన్: 45 జీబీ డేటా ఫ్రీ
దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఓప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది
దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఓప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్ లో స్మార్ట్‌పోన్ కొనుగోలుపై 45జీబీ 4జీ డేటాను అందిస్తోంది. 4జీ డేటా ప్యాక్ లో 1జీబీ లేదా అంతకంటే ఎక్కువ 4జీ డేటా ప్యాక్ కొనుగోలుపై వినియోగదారులు అదనపు డేటా ప్రయోజనాలను అందించనుంది. ఐదు రీచార్జ్‌లపై 5 నెలల గరిష్ట ప్రామాణికతతో 9జీబీ 4జీ అదనంగా అందించనుంది. ఈ ఆఫర్ల వివరాలను ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ ఆఫర్ అమెజాన్ లో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు పై అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మే 11న ఈ ఆఫర్ ప్రారంభమైందనీ, జూన్ 30 లోపు వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అమెజాన్ ఆఫర్ ఎంపిక స్మార్ట్ఫోన్లలో మాత్రమే లభిస్తుంది. వోడాఫోన్ నుండి ఆఫర్ పొందటానికి, జూన్ 30 వరకు అమెజాన్ ప్రత్యేకమైన హ్యాండ్సెట్ను కొనుగోలు చేయాలి.
వెబ్‌సైట్ సమాచారం ప్రకారం జాబితాలో శాంసంగ్, వన్5 ప్రొ, వన్ ప్లస్ 3టి, హానర్ 6 ఎక్స్, మోటోజీ ప్లే(4జనరేషన్) తదితర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. కాగా ఈ ఉచిత డేటా ఆఫర్ ఏ ఇతర ప్రత్యేకమైన డిస్కౌంట్లతో కలిపి ఉండదు.
అమెజాన్ లో కొన్న కొత్త ప్రత్యేక హ్యాండ్ సెట్లో వోడాఫోన్ సిమ్ ఇన్సర్ట్ చేయాలి. వెంటనే అమెజాన్ 1 జీబీ ఆఫర్ లేదా 9జీబీ డేటా ఉచిత ఆఫర్‌కు(అయిదు రీచార్జ్‌లపై) కు అర్హులనే సందేశం వస్తుంది.
ప్రీపెయిడ్ కనెక్షన్లకు 1 జీబీ రీ చార్జ్ లపై ఫ్రీ డేటా ఆటోమేటిగ్గా క్రెడిట్ అవుతుంది. 9జీబీ ఉచిత డేటా 28 రోజులు మాత్రమే చెల్లుతుంది. ఒక యూజర్ ఐదు సార్లు లేదా ఐదు నెలల వరకు ఆఫర్ పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్ యూజర్ 1జీబీ ప్లాన్‌లో 9 గంటల ఉచిత డేటా 48 గంటల్లోపు క్రెడిట్ అవుతుంది.