సాక్షి,ముంబై: ప్రయివేటు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఆర్ధికవ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ఉచిత ఆన్‌లైన్ లావేదేవీలకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్‌కు ఊతమిస్తూ వినియోగదారులు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రద్దు చేసింది. అలాగే చెక్ బుక్ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరించింది. ఈ మేరకు కస్టమర్లకు సమాచారాన్ని అందించింది.
బ్యాంకు ఖాతాల్లో సత్వర నగదు బదిలీకి ఉపయోగపడే రియల్ టైమ్ గ్రోస్ సెటిల్మెంట్ (RTGS) , నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) సేవలను ఉచితంగా అందించనుంది. ఈ ఆదేశాలు నవంబర్ 1, 2017 నుంచి అమల్లోకి వచ్చినట్టుతెలిపింది. తద్వారా వినియోగదారులు జరిపే లావాదేవీలపై చార్జీలు వసూలు చేయబోమని సోమవారం ప్రకటించింది. సేవింగ్, సాలరీ ఖాతాలతోపాటు, ఇతర రీటైల్ కస‍్టమర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయిని బ్యాంక్ వినియోగదారులకు అందజేసిన నోటీసులో తెలిపింది. మరోవైపు చెక్‌ఆధారిత లావాదేవీలపై అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపింది.
చెక్ ఆధారిత లావాదేవీలు, రికవరీ ఛార్జీలను, డిసెంబర్ 1, 2017 ను అమలు చేస్తామని తెలిపింది. చెక్ రిటర్న్‌కు రూ. 500 లు జరిమానా విధిస్తుంది. డిపాజిట్ చేసిన చెక్కులకు చెల్లించని సందర్భాల్లో పెనాల్టీని రూ. 100నుంచి రూ. 200 కు పెంచింది. దీంతోపాటు ఇకమీదట సం.రానికి ఒకచెక్‌బుక్ (25 లీఫ్స్) మాత్రమే ఉచితంగా అందిస్తుంది. ఇప్పటివరకు రెండు ఇచ్చేది. అయితే అదనపు చెక్‌బుక్ కోసం వసూలు చేసే చార్జిని రూ.75గానే ఉంచింది. సమర్థవంతంగా అమలు చేయని రెసిడెంట్ సేవింగ్స్ , సాలరీ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
కాగా గతంలో రెండు లక్షల లోపు ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై రూ.25, 2-5 లక్షలపై రూ.50 వసూలు చేస్తుండగా, నెఫ్ట్ లావాదేవీలపై పది వేల లోపు అయితే రూ.2.50, లక్ష లావాదేవాపై రూ. 5, ఆపైన నిర్వహించే లావాదేవీలపై రూ.15 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment