NEFT
-
ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ లావాదేవీలు అధికమవుతున్నాయి. చాలామంది యూపీఐ, ఇమ్మిడియెట్ పేమెంట్ సర్వీస్(IMPS), ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి సదుపాయాలు వినియోగిస్తుంటారు. అందులో యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా చేసిన లావాదేవీల్లో దాదాపు ఎలాంటి అవాంతరాలు జరగడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే పేమెంట్ చేసే చివరి దశలో ఒకసారి లుక్ అప్ ఫెసిలిటీ(ఖాతా దారుడి పేరుతో వివరాలు సరి చేసుకునే సదుపాయం) ఉంటుంది. కానీ రియల్‌టైం గ్రాస్ సెటిల్మెంట్(RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT) ద్వారా చేసే లావాదేవీల్లో ఈ సదుపాయం ఉండదు. దాంతో కొన్నిసార్లు పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)ను ఆర్బీఐ కోరింది.ఆన్లైన్లో నిర్వహించే నగదు లావాదేవీల్లో ఏదైనా పొరపాటు జరిగి వేరే అకౌంట్లోకి డబ్బు జమైతే తిరిగి వాటిని రాబట్టడం పెద్దపని. కాబట్టి పేమెంట్ చేసేముందే అన్ని వివరాలు సరిచూసుకుంటే సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో జరిగే మోసాలు అరికట్టడానికి, పొరబాట్లు జరగకుండా నగదు బదిలీ చేసేందుకు ఏ ఖాతాకైతే నగదు వెళుతుందో ఆ ఖాతాదారుడి పేరును తనిఖీ చేయడానికి వినియోగదార్లకు వీలు కల్పించేలా ఒక సదుపాయాన్ని (లుక్ అప్ ఫెసిలిటీ) అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)ను ఆర్బీఐ కోరింది. ఏప్రిల్ 1, 2025 వరకు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సర్వీసు అందిస్తున్న అన్ని బ్యాంకులకు ఈ సదుపాయాన్ని అందించాలని ఆర్బీఐ(RBI) సూచించింది.ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!యూపీఐ, ఐఎంపీఎస్లకు ఇలా..ఫోన్‌పే, జీపే.. వంటి థర్డ్‌పార్టీ యూపీఐ పేమెంట్ యాప్‌లు, ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న సమయంలో ఎవరికైతే డబ్బు పంపించాలో ఆ ఖాతాదారుడి పేరు వివరాలు ధ్రువీకరించే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేసే లావాదేవీలకు ఆ సదుపాయం లేదు. -
ఆ రోజున నెఫ్ట్ సేవలకు అంతరాయం
ముంబై: మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఆన్లైన్ లావాదేవీల కోసం జరిపే నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) సేవలు మే 23 రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిలిచి పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. నెఫ్ట్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు నెఫ్ట్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్లు ఆర్టీజీఎస్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆర్టీజీఎస్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్బీఐ. ఏప్రిల్ 18న ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి టెక్నికల్ అప్‌గ్రేడ్ చేపట్టిన విషయం మనకు తెలిసీందే. 2019 డిసెంబరు నుంచి నెప్ట్ సేవలను 24×7 గంటల పాటు ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. NEFT System Upgrade – Downtime from 00.01 Hrs to 14.00 Hrs. on Sunday, May 23, 2021https://t.co/i3ioh6r7AY — ReserveBankOfIndia (@RBI) May 17, 2021 చదవండి: ట్యాక్స్ రిటర్నులు రద్దు అయితే ఏం చేయాలి? -
బ్యాంకు ఖాతాదారులకి ఆర్బీఐ అలర్ట్!
మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి అలర్ట్. దేశవ్యాప్తంగా రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సేవలు ఏప్రిల్ 18న రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిలిచి పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. ఆర్టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్టీజీఎస్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్లు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవల్ని వినియోగించుకోవచ్చు. నెఫ్ట్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్బీఐ. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లావాదేవీలు జరపడానికి ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. రూ.2,00,000 కన్నా ఎక్కువ ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. అంటే కస్టమర్లు ఎప్పుడైనా ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గతంలో ఆర్టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి. భారతదేశంలో ఆర్టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2019 జూలైలో ఆర్టీజీఎస్తో పాటు నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తేసింది ఆర్బీఐ. చదవండి: పసిడి పరుగులకు బ్రేక్! -
ఎంత డబ్బైనా ఇక ఈజీగా పంపొచ్చు
న్యూఢిల్లీ, సాక్షి: నేటి నుంచి ఏడాది పొడవునా.. 24 గంటలూ ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రూ. 2 లక్షలు.. అంతకుమించి పెద్ద మొత్తాలను ఆన్లైన్ ద్వారా సులంభంగా బదిలీ చేసేందుకు వీలు చిక్కింది. వాస్తవ సమయానుగుణంగా సర్వీసులు అందుబాటులోకి రావడంతో భారీ సొమ్మును సైతం త్వరగా బదిలీ చేసేందుకు అవకాశమున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా రోజంతా ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోగల ప్రపంచంలోని కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లు తెలియజేశాయి. నగదు బదిలీ సేవలలోగల ఐదు ముఖ్యమైన పాయింట్లను చూద్దాం.. (జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్) ఈజీగా.. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి సొమ్ము రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్(ఆర్టీజీఎస్) ద్వారా బదిలీ కానుంది. ఇందుకు బ్యాంకులు అదనంగా ఎలాంటి చార్జీలనూ విధించబోవు. నేటి నుంచి ఏడాది పొడవునా.. 24 గంటలూ ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను ఆన్లైన్(ఇంటర్నెట్)తోపాటు.. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. బ్రాంచీని సందర్శించడం ద్వారా ఆఫ్లైన్లోనూ ఈ సర్వీసులను పొందవచ్చు. కనీసం రూ. 2 లక్షల మొత్తాలను ఆర్టీజీఎస్ ద్వారా పంపించవచ్చు. ఈ విధానంలో గరిష్ట పరిమితిలేదని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. నెఫ్ట్ బాటలో చిన్న మొత్తాలను పంపించుకునేందుకు అమలులో ఉన్న నెఫ్ట్ సేవలను ఆర్బీఐ ఏడాది క్రితమే రోజంతా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బాటలో తాజాగా ఆర్టీజీఎస్ సేవలనూ 24 గంటలకు ఆర్బీఐ పొడిగించింది. 4 ప్రధాన బ్యాంకుల ద్వారా 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ సేవలు దేశీయంగా తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 237 బ్యాంకుల ద్వారా రోజుకి 6.35 లక్షల లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ. 4.17 లక్షల కోట్లుకావడం విశేషం! సగటున ఆర్టీజీఎస్ ద్వారా రూ. 57.96 లక్షలు బదిలీ అవుతున్నట్లు నవంబర్ నెల డేటా తెలియజేసింది. దేశీయంగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రమోట్ చేసే బాటలో ఆర్బీఐ నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలపై అదనపు చార్జీలను విధించవద్దంటూ బ్యాంకులను ఆదేశించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
కస్టమర్లకు ఊరట : ఇక ఆర్టీజీఎస్ సేవలు 24x7
ముంబై : బ్యాంకు ఖాతాదారులకు ఊరటగా నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) ఇక వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం మినహా మిగిలిన అన్ని వర్కింగ్ డేస్‌లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మనీ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ సదుపాయాన్ని ఆర్బీఐ నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చిన క్రమంలో తాజా ప్రకటన వెలువడింది. నెఫ్ట్ వ్యవస్థను గత ఏడాది డిసెంబర్ నుంచి 24x7 అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి సాఫీగా సాగుతోందని, ఇక పెద్ద మొత్తాల బదిలీకి ఉద్దేశించిన ఆర్టీజీఎస్ సిస్టం సైతం ఇప్పుడు కస్టమర్లకు వారంలో అన్ని రోజులూ, 24 గంటల పాటు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. ఆర్టీజీఎస్ కింద రూ 2 లక్షల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు బదలాయించవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా పంపే నగదుపై గరిష్ట పరిమతి లేకున్నా పలు బ్యాంకులు రూ 10 లక్షలను గరిష్ట మొత్తంగా పరిమితి విధించాయి. చదవండి : వడ్డీ రేట్లు యథాతథం -
నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7
ముంబై: నేషనల్ ఎల్రక్టానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్/ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్లో పేర్కొంది. డిసెంబర్ 16న (డిసెంబర్ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్ సెటిల్మెంట్ జరుగుతుంది. లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా బ్యాంకులు ఆర్బీఐ వద్ద తమ కరెంటు ఖాతాల్లో తగినంత నిధుల లభ్యత ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవాలని కేంద్ర బ్యాంకు కోరింది. రెండు గంటల్లోపు లావాదేవీ మొత్తం స్వీకర్త ఖాతాలో జమ చేయడం లేదా పంపిన వ్యక్తిన ఖాతాకు వెనక్కి జమ చేయడం ఇక ముందూ కొనసాగనుంది. నెఫ్ట్ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్ కింద క్లియర్ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు.. మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాసెస్ చేస్తున్నారు. -
జనవరి నుంచి నెఫ్ట్ చార్జీలకు చెల్లు
ముంబై: వచ్చే జనవరి నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్’ (నెఫ్ట్) లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల మధ్య ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్, ఆర్టీజీఎస్ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్బీఐ నిర్వహిస్తుంటుంది. నెఫ్ట్ లావాదేవీలను బ్యాచ్‌ల వారీగా అరగంటకోసారి సెటిల్ చేస్తున్నారు. అదే ఆర్టీజీఎస్ అయితే ప్రతీ లావాదేవీ అప్పటికప్పుడే, విడిగా పూర్తి అవుతుంది. ‘‘దేశ పౌరులకు అసాధారణ చెల్లింపుల అనుభవాన్ని కలి్పంచేందుకు సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల నుంచి నెఫ్ట్ చార్జీలను 2020 జనవరి నుంచి వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశిస్తున్నాం’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పార్కింగ్ ఫీజు, ఇంధనం నింపుకునే వద్ద చెల్లింపులకు సైతం ఫాస్టాగ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికతో ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. డీమోనిటైజేషన్ జరిగి మూడేళ్లయిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతానికి రూ.10,000 విలువ వర కు నెఫ్ట్ లావాదేవీలపై రూ.2 చార్జీని, అదనంగా జీఎస్టీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. రూ. 2లక్షల పైన ఉన్న లావాదేవీలపై ఎస్బీఐ రూ.20 చార్జీని, దీనిపై జీఎస్టీని వసూలు చేస్తోంది. -
నెఫ్ట్ చార్జీలపై ఆర్బీఐ శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: సేవింగ్ బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (నెఫ్ట్) సేవలు 2020 జనవరి నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం ఆర్బీఐ లక్ష్యమని, ఈ ప్రయత్నాల ఫలితంగా రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 2018-సెప్టెంబర్ 2019 వరకు మొత్తం నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపులు 96శాతంగా ఉన్నాయి. అదే సమయంలో నెఫ్ట్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) వ్యవస్థలు సంవత్సరానికి 252 కోట్లు, 874 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి నెఫ్ట్ లావాదేవీలు 20 శాతం యూపీఐ లావాదేవాలు 263శాతం వృద్ధిని సాధించాయని తెలిపింది. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్), నెఫ్ట్ ఆర్బీఐ అందిస్తున్న రియల్ టైం పేమెంట్ వ్యవస్థలు. నెఫ్ట్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు నిధుల బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ పెద్ద మొత్తంలో నిధులను తక్షణమే బదిలీ చేసుకోవచ్చు. -
ఇకపై రోజంతా నెఫ్ట్ సేవలు
ముంబై: ఆన్లైన్ నగదు బదిలీ లావాదేవీలకు సంబంధించిన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని ఇకపై ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి దీన్ని అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని పేమెంట్ సిస్టమ్ విజన్ 2021 పత్రంలో ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నగదు బదిలీ లావాదేవీలకు నెఫ్ట్, అంతకు మించిన మొత్తానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం (ఆర్టీజీఎస్) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. రెండో, నాలుగో శనివారం మినహా ప్రస్తుతం నెఫ్ట్ సర్వీసులు ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 7 గం.ల దాకా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఆర్టీజీఎస్, నెఫ్ట్ విధానాల్లో నగదు బదిలీలపై తాను విధించే చార్జీలను ఎత్తివేసింది. మరోవైపు, ఏటీఎం చార్జీలు, ఫీజులన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కన్జ్యూమర్ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు అన్సెక్యూర్డ్ కన్జ్యూమర్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డులు మినహా అన్ని రకాల కన్జ్యూమర్ రుణాలపై (పర్సనల్ లోన్స్ సైతం) రిస్క్ వెయిటేజీని ప్రస్తుతమున్న 125% నుంచి 100%కి తగ్గించింది. ఐసీఏపై నియంత్రణ సంస్థలతో చర్చలు అంతర్–రుణదాతల ఒప్పంద (ఐసీఏ) ప్రక్రియలో బీమా సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలను (ఏఎంసీ) కూడా చేర్చే క్రమంలో ఆయా రంగాల నియంత్రణ సంస్థలైన సెబీ, ఐఆర్‌డీఏఐతో చర్చలు జరుపుతున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. మొండిబాకీల పరిష్కార ప్రక్రియలో ఐసీఏని తప్పనిసరి చేస్తూ జూన్ 7న సర్క్యులర్ ఇచ్చినట్లు ఆయన వివరించారు. -
ఆర్టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ అమలుపరిచింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ (నెఫ్ట్) ద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్టీజీఎస్ వినియోగంలో ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నెఫ్ట్ లావాదేవీలపై రూ.1–5 వరకు, ఆర్టీజీఎస్‌పై రూ.5–50 వరకు చార్జ్ చేస్తోంది. డిజిటల్ రూపంలో నిధుల బదిలీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు చార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ పేర్కొంది. వాస్తవానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లపై చార్జీలను ఎత్తివేయడమే కాకుండా, రోజులో 24 గంటల పాటు ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషిన్లపై సుంకాలు ఎత్తివేయాలని, ఇలా ఎన్నో సూచనీలను నీలేకని కమిటీ సిఫారసు చేసింది. కానీ, ఇతర అంశాలపై ఆర్బీఐ స్పందించినట్టు లేదు. ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ ఏటీఎంల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి లావాదేవీల చార్జీలను సమీక్షించాలన్న బ్యాంకుల వినతులను మన్నిస్తూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో చైర్మన్‌గా, భాగస్వాములు అందరితో కలసి ఈ కమిటీ ఉంటుందని తెలిపింది. తొలిసారి భేటీ అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సిన ఉంటుందని పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకుసంచలన నిర్ణయం: చార్జీలు రద్దు
సాక్షి,ముంబై: ప్రయివేటు దిగ్గజం హెచ్డీఎఫ్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఆర్ధికవ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ఉచిత ఆన్లైన్ లావేదేవీలకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్‌కు ఊతమిస్తూ వినియోగదారులు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలకు రద్దు చేసింది. అలాగే చెక్ బుక్ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరించింది. ఈ మేరకు కస్టమర్లకు సమాచారాన్ని అందించింది. బ్యాంకు ఖాతాల్లో సత్వర నగదు బదిలీకి ఉపయోగపడే రియల్ టైమ్ గ్రోస్ సెటిల్మెంట్ (RTGS) , నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) సేవలను ఉచితంగా అందించనుంది. ఈ ఆదేశాలు నవంబర్ 1, 2017 నుంచి అమల్లోకి వచ్చినట్టుతెలిపింది. తద్వారా వినియోగదారులు జరిపే లావాదేవీలపై చార్జీలు వసూలు చేయబోమని సోమవారం ప్రకటించింది. సేవింగ్, సాలరీ ఖాతాలతోపాటు, ఇతర రీటైల్ కస్టమర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయిని బ్యాంక్ వినియోగదారులకు అందజేసిన నోటీసులో తెలిపింది. మరోవైపు చెక్‌ఆధారిత లావాదేవీలపై అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపింది. చెక్ ఆధారిత లావాదేవీలు, రికవరీ ఛార్జీలను, డిసెంబర్ 1, 2017 ను అమలు చేస్తామని తెలిపింది. చెక్ రిటర్న్‌కు రూ. 500 లు జరిమానా విధిస్తుంది. డిపాజిట్ చేసిన చెక్కులకు చెల్లించని సందర్భాల్లో పెనాల్టీని రూ. 100నుంచి రూ. 200 కు పెంచింది. దీంతోపాటు ఇకమీదట సం.రానికి ఒకచెక్‌బుక్ (25 లీఫ్స్) మాత్రమే ఉచితంగా అందిస్తుంది. ఇప్పటివరకు రెండు ఇచ్చేది. అయితే అదనపు చెక్‌బుక్ కోసం వసూలు చేసే చార్జిని రూ.75గానే ఉంచింది. సమర్థవంతంగా అమలు చేయని రెసిడెంట్ సేవింగ్స్ , సాలరీ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా గతంలో రెండు లక్షల లోపు ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.25, 2-5 లక్షలపై రూ.50 వసూలు చేస్తుండగా, నెఫ్ట్ లావాదేవీలపై పది వేల లోపు అయితే రూ.2.50, లక్ష లావాదేవాపై రూ. 5, ఆపైన నిర్వహించే లావాదేవీలపై రూ.15 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
నేటి నుంచే ఎస్బీఐ కొత్త ఛార్జీలు
ముంబై : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల తగ్గించిన నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలు నేటి(జూలై15) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తగ్గింపుతో ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్ సర్వీసులు 75 శాతం తక్కువకు లభ్యమవుతున్నాయి. డిజిటల్ పెమంట్ల వృద్ధి చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఎస్బీఐ ఈ ఛార్జీల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే లావాదేవీలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తోంది. అలాగే బ్యాంక్.. ఐఎంపీఎస్ ద్వారా జరిపే ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై (రూ.1,000 వరకు) చార్జీలను రద్దు చేసింది. ఎస్బీఐ తగ్గించిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి... నెఫ్ట్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు (రూ.10,000 వరకు) రూ.1కి, (రూ.1 లక్ష వరకు) రూ.2కు తగ్గాయి. అంతకముందు ఈ ఛార్జీలు రెండు రూపాయలు, నాలుగు రూపాయలుగా ఉన్నాయి. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు 12 రూపాయల నుంచి 3 రూపాయలకి దిగివచ్చాయి. ఇక రూ.2 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.5గా ఉన్నాయి. ఈ చార్జీలు కూడా ముందు రూ.20గా ఉన్న విషయం విదితమే. ఆర్టీజీఎస్ విధానంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు 20 రూపాయల నుంచి 5 రూపాయలకు దిగివచ్చాయి. ఇక రూ.5 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే రూ.10 చార్జీ పడుతోంది. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.40గా ఉన్నాయి. కొత్తగా సవరించిన అన్ని చార్జీలకు జీఎస్టీ రేటు 18% వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ శాఖల్లో ఎగ్జిక్యూటివ్స్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు భిన్నంగా ఉంటాయని పేర్కొంది. ఇక మార్చి చివరి నాటికి ఎస్బీఐకి 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు, 2 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు ఉన్నారు. -
డిజిటల్ పేమెంట్స్‌కు ఎస్బీఐ దన్ను
♦ ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ చార్జీల తగ్గింపు ♦ నెఫ్ట్, ఆర్టీజీఎస్ చార్జీల్లో 75 శాతం వరకు కోత ♦ రూ.1,000 లోపు ఐఎంపీఎస్ ట్రాన్స్‌ఫర్స్‌పై చార్జీల రద్దు ♦ 5 కోట్లకుపైగా కస్టమర్లకు ప్రయోజనం న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) తాజాగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ చార్జీల్లో కోత విధించింది. వీటిని 75 శాతం వరకు తగ్గించింది. ఈ తగ్గింపు నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. దీనివల్ల 5.27 కోట్ల మంది కస్టమర్లు ప్రయోజనం పొందుతారని కూడా బ్యాంకు తెలియజేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే లావాదేవీలకు మాత్రమే తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. అలాగే బ్యాంక్.. ఐఎంపీఎస్ ద్వారా జరిపే ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై (రూ.1,000 వరకు) చార్జీలను రద్దు చేసింది. తాజా నిర్ణయంతో నెఫ్ట్ చార్జీలు ఇలా... నెఫ్ట్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు (రూ.10,000 వరకు) రూ.1కి, (రూ.1 లక్ష వరకు) రూ.2కు తగ్గనున్నాయి. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.3కి దిగివస్తాయి. బ్యాంక్ ప్రస్తుతం ఈ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై రూ.12 వరకూ చార్జీలను వసూలు చేస్తోంది. ఇక రూ.2 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.5గా ఉంటాయి. ఈ చార్జీలు ప్రస్తుతం రూ.20గా ఉన్నాయి. ఆర్టీజీఎస్ చార్జీల విషయానికి వస్తే.. ఆర్టీజీఎస్ విధానంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.5గా ఉంటాయి. ప్రస్తుతం బ్యాంక్ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్కి రూ.20 చార్జీని వసూలు చేస్తోంది. ఇక రూ.5 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే రూ.10 చార్జీ పడుతుంది. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.40గా ఉన్నాయి. కొత్తగా సవరించిన అన్ని చార్జీలకు జీఎస్టీ రేటు 18% వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ శాఖల్లో ఎగ్జిక్యూటివ్స్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు భిన్నంగా ఉంటాయని పేర్కొంది. ఇక మార్చి చివరి నాటికి ఎస్బీఐకి 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు, 2 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు ఉన్నారు. డిజిటల్ లావాదేవీల వృద్ధిలో మూడేళ్లు ముందే.. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. మే నెలలో పీవోఎస్ టర్మినల్స్ వద్ద క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణం కేవలం ఏడు నెలల్లోనే (గతేడాది నవంబర్ నుంచి) రూ.70,000 కోట్ల స్థాయికి చేరింది. డీమోనిటైజేషన్ సహా కేంద్ర ప్రభుత్వపు వివిధ కార్యక్రమాలు దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఒకవేళ డీమోనిటైజేషన్ జరిగి ఉండకపోతే పీవోఎస్ మెషీన్ల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణం ఈ స్థాయిని చేరుకోడానికి కనీసం మూడేళ్ల కాలం పట్టేదని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. పీవోఎస్ టర్మినల్స్ సంఖ్య పెరగడం, డిజిటల్ లావాదేవీలు సరళతరం కావడం వంటి అంశాల కారణంగా రానున్న రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. ఎం–వాలెట్, పీపీఐ కార్డులు, పేపర్ వోచర్స్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి వినియోగం కూడా పెరిగిందని పేర్కొంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని తెలిపింది. -
ఆ చార్జీలను తగ్గించిన ఎస్బీఐ
న్యూడిల్లీ: దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ట్రాన్స్ఫర్ చార్జీలను భారీగా తగ్గించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (ఎన్ఈఎఫ్టీ), రియల్ టైమ్ గ్రోస్ డెట్లెమెంట్ (ఆర్టిజిఎస్) ఛార్జీలు 75శాతం వరకు తగ్గించినట్టు గురువాం ప్రకటించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ , బ్యాంకు అందించే మొబైల్ బ్యాంకింగ్ సేవలు ద్వారా జరిగే లావాదేవీలలో తగ్గిన ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తగ్గింపు ధరలు జూలై 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఎకానమీ సాధనలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించడానికే ఈ చర్య అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు. ఎన్ఈఎఫ్టీ సవరించిన రేట్ల ప్రకారం నెఫ్ట్ లావాదేవీలకు రూ.10 వేలకు వరకు రూ. 2 బదులుగా ఇకపై ఒక రూపాయి వసూలు చేయనున్నారు. రూ.10వేల నుంచి లక్షరూపాయల వరకు ట్రాన్సఫర్‌పై ప్రస్తుత రూ. 4 కు బదులుగా 2 రూపాయలు వసూలు చేస్తారు. ఒక లక్ష నుంచి రెండులక్షలరూపాయల మధ్య రూ .12బదులుగా ఇకపై రూ. 3 చార్జ్ పడుతుంది. ఆర్టీజీఎస్ రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల లావాదేవీపై రూ .20 స్థానంలో ఇకపై 5 రూపాయలు వసూలు చేయనున్నట్లు ఎస్బీ తెలిపింది. రు. 5 లక్షల పైన ట్రాన్సఫర్‌పై రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. కాగా మార్చి 31, 2017 నాటికి ఎస్బీఐ 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులుండగా దాదాపు 2 కోట్ల మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు నమోదయ్యారు. చిన్న లావాదేవీలకు ప్రోత్సాహించడంతోపాటు, జీఎస్టీ నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్సఫర్లపై కొత్త చార్జీలను ప్రకటించింది. రూ.1000 కి ఎలాంటి చార్జీలు లేకుండా, రూ.1000 నుంచి రూ.1 లక్ష కు రూ.5+జీఎస్టీ , రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల ట్రాన్సఫర్లకు రూ.15+జీఎస్టీ చార్జీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
జూలై 1న కూడా ఆర్బీఐ లావాదేవీలు
ముంబై: ఆర్బీఐ జూలై 1న కూడా ప్రజలకు, మార్కెట్లకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించనుంది. సాధారణంగా ఆర్బీఐ జూలై 1న ఖాతాల వార్షిక మదింపు సందర్భంగా ప్రజలకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలను నిర్వహించదు. ఆర్బీఐ అకౌంటింగ్ సంవత్సరం జూలై-జూన్గా ఉంటుంది. ఎన్ఈఎఫ్టీ, నగదు బదిలీ, సెక్యూరిటీస్ సెటిల్మెంట్ వంటి తదితర సర్వీసులు జూలై 1న ఉదయం 11 నుంచి అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. -
ధన ప్రవాహానికి అడ్డుకట్ట!
న్యూఢిల్లీ: ఎన్నికలలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) పది సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింది. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ప్రణాళిక అమలుకు సంబంధించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఈసీ ప్రతిపాదనల ప్రకారం... పార్టీ అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పద్దులను, చిట్టాలను పార్టీ కోశాధికారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీకి అందే విరాళాలు లేదా నిధులను సహేతుకమైన సమయంలోగా గుర్తింపు పొందిన బ్యాంకులోని ఖాతాలో జమ చేయాలి. పార్టీ సభలు, ఎన్నికల ప్రచారం ఖర్చుల నిమిత్తం ఏకమొత్తంలో నిధులు ఇవ్వదలస్తే, ఆ మొత్తాన్ని చెక్ (ఖాతా ద్వారా చెల్లింపు), డ్రాఫ్ట్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లేదా ఇంటర్నెట్ బదిలీ ద్వారా మాత్రమే చెల్లించాలి. నిర్దేశించిన మొత్తం కన్నా ఎక్కువగా అభ్యర్థి కానీ, కార్యకర్తలు కానీ తమ వెంట తీసుకెళ్లకుండా ఆయా రాజకీయ పార్టీలే చూసుకోవాలి.