ముంబై: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ లావాదేవీల కోసం జరిపే నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) సేవలు మే 23 రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిలిచి పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. నెఫ్ట్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు నెఫ్ట్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్లు ఆర్‌టీజీఎస్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్‌బీఐ. ఏప్రిల్ 18న ఆర్‌టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి టెక్నికల్ అప్‌గ్రేడ్ చేపట్టిన విషయం మనకు తెలిసీందే. 2019 డిసెంబరు నుంచి నెప్ట్ సేవలను 24×7 గంటల పాటు ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది.
NEFT System Upgrade – Downtime from 00.01 Hrs to 14.00 Hrs. on Sunday, May 23, 2021https://t.co/i3ioh6r7AY
— ReserveBankOfIndia (@RBI) May 17, 2021
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment